/rtv/media/media_files/2025/02/01/R5hlEEqsLRiA5ENLJMx7.jpg)
Donald Trump
అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ సమీపంలో ఇటీవల ఓ అనుమానితుడి కదలికలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. దాంతో అధ్యక్షుడు ట్రంప్ సిబ్బంది భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.ఈ క్రమంలో తాజాగా మరోసారి భద్రతా వైఫల్యం చోటు చేసుకోవడం గమనార్హం.ఆదివారం ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసం సమీపంలో అమల్లో ఉన్న ఆంక్షలు ఉల్లంఘనకు గురైనట్లు తెలుస్తోంది.
Also Read: Russia: పైప్ లైన్ లో 15 కిలో మీటర్లు..ఉక్రెయిన్ సేనలకు చుక్కలు చూపించిన రష్యా!
ఆ భవనం దిశగా ఒక పౌర విమానం దూసుకొచ్చింది. దానిని గమనించిన వైమానిక దళం అడ్డుకుంది.ట్రంప్ తన వెస్ట్ పామ్ బీచ్ లో గోల్ఫ్ ఆడుతున్నప్పుడు ఈ ఘటన జరిగిందని నార్త్ అమెరికన్ ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది.ఆంక్షలు ఉన్న ప్రాంతంలోకి వచ్చిన ప్రైవేటు విమానాన్ని ఎఫ్ -16 విమానాలు అడ్డుకున్నాయి.
Also Read: PM Modi: ఇది అసాధారణ మ్యాచ్..టీమిండియా విజయం అపూర్వం అంటూ మోడీ ప్రశంసలు!
శనివారం ఉదయం కూడా ఇలాగే మరో పౌర విమానాన్ని జెట్స్ నిలువరించాయి. ఈ పరిణామాల వేళ ప్రైవేట్ విమానాల పైలట్ లు ఆంక్షలను పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ఇదిలా ఉంటే వైట్ హౌస్ సమీపంలో అనుమానితుడి కదలికల గురించి స్థానిక పోలీసులు సీక్రెట్ సర్వీస్ కు సమాచారం అందించారు. దాంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
అధ్యక్ష భవనానికి కొంతదూరంలో పార్క్ చేసిన ఒక వాహనాన్ని గుర్తించారు.సమీపంలో ఓ వ్యక్తి నడిచి వెళ్తుండగా అతడి వద్దకుచేరుకునేందుకు ప్రయత్నించారు. అధికారులు రావడాన్ని గమనించిన అతడు వెంటనే తన వద్ద ఉన్న తుపాకీ బయటకు తీశాడు.అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా వారి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
అతడు కాల్పులు జరిపేందుకుయత్నిస్తుండగా..సిబ్బంది నిందితుడి పై కాల్పులు జరిపారు. గాయపడిన నిందితుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.
Also Read: Rains: రైతులకు షాక్.. ఈ ఏడాది వానలు అంతంత మాత్రమే.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే!?