Greta Thunberg: గ్రెటా థన్‌బర్గ్‌ వెళ్తున్న నౌకపై డ్రోన్‌ దాడులు..

స్వీడన్ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌ గాజాలోని ప్రజలకు మానవతా సాయం అందించేందుకు బయలుదేరింది. ఆమెతో సహా పలువురు ప్రయాణిస్తున్న నౌకపై డ్రోన్‌ దాడి జరగడం కలకలం రేపింది. ట్యునీషియా తీరం వద్ద జరిగిన ఈ ఘటన చోటుచేసుకుంది.

New Update
Aid ship to Gaza carrying Greta Thunberg hit in alleged drone strike off Tunisia

Aid ship to Gaza carrying Greta Thunberg hit in alleged drone strike off Tunisia

హమాస్‌ను నిర్మూలించడమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. అయితే స్వీడన్ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌ గాజాలోని ప్రజలకు మానవతా సాయం అందించేందుకు బయలుదేరింది. ఆమెతో సహా పలువురు ప్రయాణిస్తున్న నౌకపై డ్రోన్‌ దాడి జరగడం కలకలం రేపింది. ట్యునీషియా తీరం వద్ద జరిగిన ఈ ఘటన చోటుచేసుకుంది. నౌకలోని సిబ్బంది, ఇతర ప్రయాణికులు సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం. గ్లోబల్ సమూద్‌ ఫ్లోటిల్లా (GSF) అనే సంస్థ  ఈ దాడి జరిగినట్లు ప్రకటించింది. 

Also Read: అదే జరిగితే..సగం సుంకాలను తిరిగి చెల్లిస్తాం..అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్ బెసెంట్

Also Read: నవారో నోటికి హద్దే లేకుండా పోతోంది..భారత్ కు మంచి ముగింపు లేదంటూ మరోసారి..

ఈ నౌకలో ఫ్లోటిల్లా స్టీరింగ్‌ కమిటీ సభ్యులు ఉన్నారని.. అందులో పోర్టుగీసు జెండా కూడా ఉందని పేర్కొంది. ఈ డ్రోన్‌ దాడి జరిగినప్పటికీ అందరు సురక్షింతగా ఉన్నారని తెలిపింది. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉందని చెప్పింది. గాజాకు వ్యతిరేకంగా జరిగే ఇలాంటి దాడులు తమకు ఆపలేవని పేర్కొంది. ఈ నౌకలో గ్రెటా థన్‌బర్గ్‌తో పాటు 44 దేశాలకు చెందిన పౌరులు ఉన్నట్లు సమాచారం. 

Also Read: నేపాల్ సంచలన నిర్ణయం.. సోషల్ మీడియా యాప్స్‌పై నిషేధం ఎత్తివేత

మరోవైపు ఈ నౌకపై డ్రోన్‌ జరిగిందనే వాదనలను ట్యునీషియా అధికారులు తీవ్రంగా ఖండించారు. డ్రోన్‌ దాడికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. అయితే నౌక లోపలి నుంచి పేలుడు జరిగినట్లు నేషనల్ గార్డ్ ప్రతినిధి చెప్పారు. ఈ దాడి తర్వాత ట్యునీషియాలో సీడీ బౌ సైద్‌ ఓడరేవు వద్దకు చాలమంది చేరుకున్నారు. వాళ్లందరూ పాలస్తీనా జెండాలతో నినాదాలు చేసినట్లు సమాచారం.   

Also Read: ఇదెక్కడి ట్విస్ట్ మావా.. దొంగతనం చేయడంలో కిక్కే వేరట.. బయటపడ్డ సర్పంచ్ భాగోతం

Advertisment
తాజా కథనాలు