Nepal: నేపాల్ సంచలన నిర్ణయం.. సోషల్ మీడియా యాప్స్‌పై నిషేధం ఎత్తివేత

నేపాల్‌లో సోషల్ మీడియా యాప్స్‌పై నిషేధం విధించడంతో అక్కడి జెన్ Z యువత ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తీవ్ర వ్యతిరేకత రావడంతో నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియా యాప్స్‌పై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది.

New Update
Nepal government lifts ban on social media after violent protests

Nepal government lifts ban on social media after violent protests

నేపాల్‌లో సోషల్ మీడియా యాప్స్‌పై నిషేధం విధించడంతో అక్కడి జెన్ Z యువత ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. పోలీసులుకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు తలెత్తడంతో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో నేపాల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా యాప్స్‌పై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటన చేసింది.  

సోమవారం రాత్రి ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ నేతృత్వంలో కేబినెట్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఇటీవల సామాజిక మాద్యమాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. కేబినేట్ మీటింగ్ అనంతరం ఆ దేశ ఐటీ శాఖ మంత్రి పృథ్వీ సుభా గురుంగ్‌ మాట్లాడారు. జనరేషన్ Z డిమాండ్ మేరకు సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసినట్లు ప్రకటించారు. వాటికి సంబంధించిన సైట్లను తిరిగి ప్రారంభించేందుకు సమాచార మంత్రిత్వ శాఖ సంబంధిత ఏజెన్సీలను సంప్రదించినట్లు పేర్కొన్నారు.   

Also Read: నవారో నోటికి హద్దే లేకుండా పోతోంది..భారత్ కు మంచి ముగింపు లేదంటూ మరోసారి..

ఆయన ఈ ప్రకటన చేసిన తర్వాత సోమవారం అర్ధరాత్రి దాటక వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌, ఎక్స్‌ తదితర సోషల్ మీడియా సైట్లు పనిచేయడం ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం వీటిపై నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో ఆందోళనకారులు నిరసనలు విరమించాలని మంత్రి పృథ్వీ సుభా గురుంగ్ కోరారు. 

ఇదిలాఉండగా ఇటీవల నేపాల్‌ ప్రభుత్వం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌తో సహా 26 సోషల్ మీడియా సైట్లను కమ్యూనికేషన్లు, సమాచార సాంకేతిక శాఖ వద్ద రిజిస్టర్ చేసుకోవాలని కోరింది. ఫేక్ వార్తలు, ద్వేషపూరిత ప్రచారం లాంటివి ఎక్కువవుతున్నాయనే కారణాలతో ఈ సూచనలు చేసింది. తాము విధించిన రూల్స్ పాటించాలని కోరింది. ఇందుకోసం ఆగస్టు 28 గడవు విధించింది. కానీ ఈ సోషల్ మీడియా సంస్థలు ఐటీ శాఖ వద్ద రిజిస్టర్ కాకపోవడంతో నేపాల్ ప్రభుత్వం వాటిపై నిషేధం విధించింది. ఇది అక్కడి యువతలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు నేపాల్‌లో పెరిగిపోతున్న అవినీతి, వారసత్వ రాజకీయాల వంటి అంశాలపై కూడా ప్రజలు రగిలిపోయారు. 

Also Read: మేనల్లుడితో అత్త అక్రమ సంబంధం..  భర్తను చంపి ఇంటి వెనకాల పాతిపెట్టిన భార్య

ఈ క్రమంలోనే సోమవారం రాజధాని కాట్మాండ్‌లో భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఆ తర్వాత ఈ నిరసనలు నేపాల్‌లోని ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించాయి. ఈ ఆందోళనలు హింసాత్మక ఘర్షణలకు దారితీయడంతో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మంది గాయాలపాలయ్యారు. చివరికి వెనక్కి తగ్గిన నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియా యాప్స్‌పై విధించిన బ్యాన్‌ను ఎత్తివేసింది. 

Advertisment
తాజా కథనాలు