Plane Crash: గాల్లో ఉండగా కుప్పకూలిన విమానం.. వీడియో వైరల్

వెనిజులాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. పామామిల్లో విమానశ్రయంలో ఓ చిన్న విమానం టెకాఫ్‌ అవుతుండగా అదుపుతప్పి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్, మరో ప్రయాణికుడు మృతి చెందారు.

New Update
A plane crash occurred in Venezuela, Two Killed

A plane crash occurred in Venezuela, Two Killed

వెనిజులాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. పామామిల్లో విమానశ్రయంలో ఓ చిన్న విమానం టెకాఫ్‌ అవుతుండగా అదుపుతప్పి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్, ఓ ప్యాసింజర్‌ మృతి చెందారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  వీడియోలో చూస్తే ఆ చిన్న విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికే గాల్లో పల్డీ కొట్టింది. ఆ తర్వాత వెంటనే కుప్పకూలింది. మంటలు చెలరేగి ఆ విమానం దగ్ధమైంది. 

Venezuela Plane Crash

Also read: అమెరికాలో ముగ్గురి చావుకు కారణమైన భారతీయుడు.. భయంకరమైన VIDEO

అయితే పైలట్‌ ఆ విమానాన్ని గాల్లో తిప్పాలని ప్రయత్నించగా అది ఫెయిల్ అవ్వడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడున్న వాళ్లు చెబుతున్నారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేశారు. మరోవైపు ఈ ప్రమాదంపై అధికారులు విచారణకు ఆదేశించారు. 

Also Read: దమ్ముంటే మమ్నల్ని ఎదుర్కో.. ఆసిం మునీర్‌కు టీటీపీ హెచ్చరిక

Advertisment
తాజా కథనాలు