/rtv/media/media_files/2025/09/12/indian-couple-caught-in-nepal-gen-z-protest-jumps-from-burning-hotel-to-save-lives-2025-09-12-11-53-35.jpg)
Indian Couple Caught In Nepal Gen Z Protest Jumps From Burning Hotel To Save Lives
నేపాల్లో సోషల్ మీడియా బ్యాన్‌కు వ్యతిరేకంగా జెన్ జీ యువత చేపట్టిన ఆందోళనలు హింసాత్మక ఘటనలకు దారి తీసిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి, ఇతర మంత్రులకు నిప్పు పెట్టారు. అలాగే పార్లమెంటు, సుప్రీంకోర్టు భవనాలతో పాటు పలు హోటళ్లను కూడా తగలబెట్టారు. ఈ నిరసనల నడుమ భారత్‌కు చెందిన ఓ మహిళ మృతి చెందిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో రాజేష్ దేవి గోలా (57), రాంవీర్ సింగ్ గోలా దంపతులు ఉంటున్నారు. వీళ్లు నేపాల్‌లో పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించేదుకు సెప్టెంబర్ 7న అక్కడికి వెళ్లారు.
Also Read: ఎలోన్ మస్క్ నంబర్ వన్ స్థానాన్ని లాగేసుకున్న 81 ఏళ్ళ వ్యక్తి..అతనెవరో తెలుసా?
రాజధాని ఖాట్మండ్‌లోని హయత్ రీజెన్సీ అనే హోటల్‌లో బస చేశారు. ఆ తర్వాత నేపాల్‌లో పరిస్థితులు తీవ్రమయ్యాయి. సెప్టెంబర్ 9న వాళ్లు ఉంటున్న హోటల్‌ను ఆందోళనకారులు రాత్రి సమయంలో వచ్చి నిప్పుపెట్టారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు యత్నించినా కూడా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆ మంటల నుంచి తప్పించుకునేందుకు కొందరు వ్యక్తులతో పాటు ఆ దంపతులు నాలుగో అంతస్తు నుంచి కిందకి దూకారు. ఈ దుర్ఘటనలో భార్య దేవీ గోలా మృతి చెందింది. భర్త రాంవీర్ సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని సహాయక శిబిరానికి తీసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు.
Also Read: నేపాల్లో జెన్ జీ ఉద్యమానికి కారణమైన నెపో కిడ్స్..వారి సోషల్ మీడియా పోస్ట్ లు
ఇలాంటి సమయంలో నేపాల్ ఉన్న భారత రాయబార కార్యాలయం నుంతి తమకు ఎలాంటి సాయం అందలేదని యూపీలోని బాధిత కుటుంబీకులు వాపోతున్నారు. భార్య మృతి గురించి కూడా అధికారులు సమాచారం అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా సోమవారం నేపాల్ ఘర్షణలు మొదలయ్యాయి. ఈ హింసాత్మక ఘటనల్లో ఇప్పటిదాకా 34 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1338 మంది గాయాలపాలయ్యారు.
Also Read: అధ్యక్షుడు ఒకలా..వాణిజ్య మంత్రి మరొకలా..రష్యా చమురు కొనుగోలు ఆపితేనే చర్చలని ప్రకటన
రామెచ్చాప్ జిల్లాలోని జైలు వద్ద జరిగిన ఘర్షణల్లో ముగ్గురు ఖైదీలు మరణించారు. 13 మంది గాయాలపాలయ్యారు. ఖాట్మాండు, లలిత్‌పుర్, భర్తపుర్‌లో ఇంకా కర్ఫ్యూ కొనసాగుతోంది. అయితే గురువారం ఉదయం 6 గంటల నుంచి 10 వరకు కర్ఫ్యూను సడలించారు. మళ్లీ 10 నుంచి సాంయత్రం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేశారు. ఆ తర్వాత సాయంత్ర 5 నుంచి 7 వరకు సడలించి.. మళ్లీ రాత్రి 7 నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు నిషేధాజ్ఞలు కొనసాగాయి. ప్రస్తుతం పరిస్థితులు సద్ధుమణుగుతున్నాయి.
ఇదిలాఉండగా నేపాల్‌లో తాత్కాలిక ప్రధాని ఎవరనేది ఇంకా తేలలేదు. మొదటగా ఆ దేశ సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కీకే బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం నడిచింది. మళ్లీ ఎలక్ట్రిసిటీ ఆథారిటీ మాజీ సీఈవో కుల్మాన్ ఘీసింగ్ పేరు తెరపైకి వచ్చింది. మరోవైపు ఖాట్మండు మేయర్ కూడా బాలేంద్ర షా కూడా తాత్కాలిక ప్రధాని రేసులో ఉన్నారు. కొత్త ప్రధానిని ఎన్నుకునే విషయంలో జెన్ జీ ప్రతినిధుల్లో చీలిక వచ్చినట్లు తెలుస్తోంది.