Pakistan: పాకిస్థాన్‌లో డ్రోన్ దాడి.. నలుగురు చిన్నారులు మృతి

పాకిస్థాన్‌లో ఖైబర్ పంఖ్తువా ప్రావిన్స్‌లో అనుమానిత డ్రోన్‌ దాడి జరిగినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఈ దాడిలో నలుగురు చిన్నారులు మృతి చెందారని.. వాళ్లందరూ ఒకే కుటుంబానికి చెందినవాళ్లని పేర్కొన్నారు.

New Update
4 children killed in suspected drone strike in northwest Pakistan

4 children killed in suspected drone strike in northwest Pakistan

పాకిస్థాన్‌లో ఖైబర్ పంఖ్తువా ప్రావిన్స్‌లో అనుమానిత డ్రోన్‌ దాడి జరిగినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఈ దాడిలో నలుగురు చిన్నారులు మృతి చెందారని.. వాళ్లందరూ ఒకే కుటుంబానికి చెందినవాళ్లని పేర్కొన్నారు. మరో అయిదుగురికి గాయాలయ్యాయని చెప్పారు. సోమవారం పాక్‌ భద్రతా బలగాలు, తీవ్రవాదుల మధ్య కాల్పులు జరిగిన సమయంలో ఈ డ్రోన్‌ దాడి జరిగినట్లు వెల్లడించారు.

Also Read: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు.. విచారణలో బయటపడ్డ షాకింగ్ విషయాలు

సోమవారం మధ్యాహ్నం హుర్ముజ్‌ అనే గ్రామంలోని ఓ ఇంటిలో ఈ డ్రోన్ దాడి జరిగినట్లు పేర్కొన్నారు. భారీ పేలుడు సంభవించడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు మృతి చెందారనట్లు స్పష్టం చేశారు. దీంతో అక్కడి స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళనలకు దిగారు. డ్రోన్‌ దాడికి కారణమైనవాళ్లని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. 

Also Read: అమెరికాలో దారుణం.. భారత సంతతి వ్యాపారిని చంపిన మరో భారతీయుడు

 ఖైబర్ పంఖ్తువాకు చెందిన మంత్రి హజి నెక్ మహమ్మద్‌ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రజలకు దూరంగా యుద్ధానికి సంబంధించిన ఆపరేషన్‌లు జరపాలని తాను అసెంబ్లీలో స్పష్టంగా చెప్పానని ఎక్స్‌లో పేర్కొన్నారు. దీనివల్ల సాధారణ ప్రజలు ముఖ్యంగా మహిళలు, చిన్నారులకు ఎలాంటి ముప్పు ఉండదని చెప్పారు. 

Also Read: నారాయణపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 20 మంది మావోయిస్టులు మృతి

Also Read: బెయిల్ ఇచ్చేందుకు ఏడాదిపాటు జైల్లో ఉండాల్సిన పని లేదు: సుప్రీంకోర్టు

telugu-news | pakistan | drone-attack | drone attacks in pakistan | terrorists 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు