/rtv/media/media_files/2025/01/18/A9bLeCakd1kx0gmaRUhv.jpg)
Rahul Gandhi
కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ.. బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే పేపర్ లీకేజీ ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. పేపర్ లీక్‌లు చేస్తూ యువత హక్కులను హరించే ఆయుధంగా కాషాయ పార్టీ మార్చుకుందని ఆరోపణలు చేశారు. '' బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రతీసారి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల దీనికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన బీపీఎస్సీ (బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ) అభ్యర్థులపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు.
Also Read: ఛత్తీస్‌ఘడ్ ఎన్‌కౌంటర్‌లో నల్గొండ వాసి మృతి.. ఆ గ్రామంలో విషాద ఛాయలు!
అభ్యర్థుల వద్దకు వెళ్లినప్పుడు తమకు జరిగిన అన్యాయాన్ని నాకు చెప్పారు. పేపర్ లీక్ అయితే సోషల్ మీడియాలో అది వైరల్ అవుతుంది. ప్రస్తుతం అభ్యర్థులు దీనివల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు. గాంధేయ మార్గంలో నిరసనలు తెలుపుతున్న వాళ్లపై పోలీసులు దాడి చేసేందుకు యత్నించారు. కేసులు కూడా పెట్టారు. 28 పరీక్షా కేంద్రాల్లో రిగ్గింగ్ జరిగినా కూడా ప్రభుత్వం అంగీకరించేందుకు సిద్ధంగా లేదు.
Also Read: కేజీ టు పీజీ ఫ్రీ, వాళ్లకి రూ.15 వేలు ఆర్థిక సాయం.. మరో మేనిఫెస్టో ప్రకటించిన బీజేపీ
ఈ సమస్య కేవలం బిహార్‌కు చెందినది మాత్రమే కాదు. దేశానికి సంబంధించిన సమస్య. దీనిపై అభ్యర్థులు చేస్తున్న నిరసనల అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని'' రాహుల్ గాంధీ తన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో పోస్టు పెట్టారు. ఇదిలాఉండగా.. గతేడాది డిసెంబర్ 13న నిర్వహించిన బీపీఎస్సీ పరీక్ష ప్రశ్నపత్రం లీకైందని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అభ్యర్థులు నిరసనలు చేపట్టారు. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: కుంభమేళాలో గంటె పట్టిన అదానీ.. ప్రతి రోజు లక్ష మందికి అన్నదానం
Also Read: మహమ్మద్ ప్రవక్తను అవమానించాడని పాప్ సింగర్‌కు మరణ శిక్ష...ఎక్కడో తెలుసా!