Indian Origin women:విహారయాత్రకు వెళ్లి.. కరేబియన్ దేశంలో భారత సంతతి విద్యార్థిని మిస్సింగ్

సుదీక్ష కోనంకి అనే భారత సంతతికి చెందిన యువతి తన తల్లిదండ్రులతో కలిసి అమెరికాలోని వర్జీనియాలో నివాసం ఉంటోంది. సుదీక్ష గత వారం డొమినికన్ రిపబ్లిక్ దేశానికి సుదీక్ష విహార యాత్రకు వెళ్లింది.అక్కడ సముద్ర తీరాన సంచరిస్తుండగా ఆమె కనిపించకుండా పోయింది.

New Update
sudhekha

sudhekha

భారత సంతతికి  చెందిన 20 ఏళ్ల యువతి.. తన కుటుంబంతో కలిసి అమెరికాలో నివాసం ఉంటుంది. అక్కడ పిట్స్‌బర్గ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చదువుతోంది. అయితే ఈమె గత వారం స్నేహితులతో కలిసి కరేబియన్ దేశానికి విహార యాత్రకు వెళ్లింది. అక్కడ  బీచ్‌లో ఎంజాయ్ చేస్తుండగా.. సడెన్‌గా కనిపించకుండా పోయింది. విషయం గుర్తించిన అధికారులు ఆమె కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. 

Also Read: ICC Champions Trophy 2025: అంబరాన్నంటిన టీమిండియా జట్టు సంబరాలు.. ఫొటోలు

 సుదీక్ష కోనంకి అనే భారత సంతతికి చెందిన యువతి తన తల్లిదండ్రులతో కలిసి అమెరికాలోని వర్జీనియాలో నివాసం ఉంటోంది. స్నేహితులతో కలిసి సుదీక్ష గత వారం డొమినికన్ రిపబ్లిక్ దేశానికి సుదీక్ష విహార యాత్రకు వెళ్లింది.  ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ప్యూంటా కానాను సందర్శించింది. మార్చి 6వ తేదీ రోజు స్థానికంగా ఉన్న రియూ రిపబ్లికా రిసార్ట్ వద్ద బీచ్‌కు  నడిచి వెళ్లారు.

Also Read: America Flight Accident: అమెరికాలో మరో విమాన ప్రమాదం...

కాసేపటి తర్వాత ఆమె స్నేహితులు అంతా తిరిగి రిసార్ట్‌కు వెళ్లిపోయారు. కానీ సుదీక్ష మాత్రం అక్కడే చాలాసేపు తిరిగింది. ఆ తర్వాత కూడా ఆమె ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో.. స్నేహితులంతా వెళ్లి వెతికారు. ఎలాంటి ఉపయోగమూ లేకపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు బీచ్‌లో గాలింపు చర్యలు చేపట్టారు.

డ్రోన్లు, హెలికాప్టర్లతో గత నాలుగు రోజులుగా ఆమె కోసం వెతుకుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె బీచ్‌లో కొట్టుకుపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. సముద్రంలో కూడా గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. బిడ్డ బతికుందో లేదో తెలియక నరక యాతన అనుభవిస్తున్నారు. సుదీక్ష తండ్రి కోనంకి సుబ్బరాయుడు భారత దేశానికి చెందిన వాడు. అయితే 25 ఏళ్ల క్రితమే ఆయన అమెరికాకు వలస వెళ్లి అక్కడే శాశ్వత నివాస హోదాను కూడా పొందారు. ప్రస్తుతం వర్జీనియాలో ఉంటున్నారు.

Also Read: Champions Trophy 2025: ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా.. చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ

Also Read: Russia: పైప్‌ లైన్‌ లో 15 కిలో మీటర్లు..ఉక్రెయిన్‌ సేనలకు చుక్కలు చూపించిన రష్యా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు