/rtv/media/media_files/2025/03/10/2T8jOMRWjZAIgKzU2Tof.jpg)
Rohith Sharma
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 83 బంతుల్లో మొత్తం 76 పరగులు చేసి చరిత్ర సృష్టించాడు. 76 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఐసీసీ ఓడీఐ టోర్నమెంట్ ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ప్రపంచంలోనే అందుకున్న అతి పెద్ద వయస్కుడిగా నిలిచాడు. 37 ఏళ్లు నిండిన తర్వాత ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న ఏకైక ఆటగాడు రోహిత్ శర్మనే.
ఇది కూడా చూడండి: BIG BREAKING: సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం
అతి పెద్ద వయస్సు ఆటగాళ్లు
రోహిత్ శర్మ- 37 ఏళ్ల 313 రోజులు
ఆడమ్ గిల్‌క్రిస్ట్-35 ఏళ్ల 165 రోజులు
మొహిందర్ అమర్‌నాథ్-32 ఏళ్ల 274 రోజులు
క్లైవ్ లాయిడ్- 30రోజుల్లో 294 రోజులు
ఇది కూడా చూడండి: HYD: హైదరాబాద్ లో మిన్నంటిన సంబరాలు..పోలీసుల లాఠీ ఛార్జ్
ఇదిలా ఉండగా ఫైనల్ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిస్తారని జోరుగా ప్రచారం సాగింది. ఈ క్రమంలో టీమిండియా ఘన విజయం తర్వాత రోహిత్ శర్మను విలేకర్లు రిటైర్మెంట్ గురించి ప్రశ్నించారు. దీనికి రోహిత్ స్పందిస్తూ.. ఇప్పుడే రిటైర్ కావడం లేదని తెలిపారు. భవిష్యత్తు ప్రణాళికల బట్టి నిర్ణయాలు మారవచ్చు. కానీ, ప్రస్తుతానికి అయితే రిటైర్మెంట్ చేయడం లేదని, తప్పుడు ప్రచారాలు చేయవద్దని తెలిపారు. దీంతో రోహిత్ రిటైర్మెంట్ వార్తలకు పూర్తిగా చెక్ పెట్టారు.
ఇది కూడా చూడండి: ind vs nz: భారత్ vs న్యూజిలాండ్ మ్యాచ్.. హైలైట్స్ ఇవే!