America Flight Accident: అమెరికాలో మరో విమాన ప్రమాదం...

అమెరికాలో మరో సారి విమాన ప్రమాదం జరిగింది. పెన్సిల్వేనియాలోని ఓ నివాస ప్రాంతంలోని పార్కింగ్ ప్లేస్ లో ఓ చిన్న విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఐదుగురు తీవ్రగాయాలు పాలయ్యారు. డజన్ల కొద్ది వాహనాలు దెబ్బతిన్నాయి.

New Update

అమెరికాలో మరో సారి విమాన ప్రమాదం జరిగింది. పెన్సిల్వేనియాలోని ఓ నివాస ప్రాంతంలోని పార్కింగ్ ప్లేస్ లో ఓ చిన్న విమానం కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఐదుగురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. వారంతా కూడా తీవ్ర గాయాలపాలైయ్యారని స్థానిక అధికారులు పేర్కొన్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. 

Also Read: PM Modi: ఇది అసాధారణ మ్యాచ్‌..టీమిండియా విజయం అపూర్వం అంటూ మోడీ ప్రశంసలు!

ఈ ఘటన పెన్సిల్వేనియాలోని లాంకాస్టర్‌ లో జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో సమీపంలోని డజను కు పైగా వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒకే ఇంజిన్‌ బీచ్‌క్రాఫ్ట్‌ బొనాంజా విమానంమని అధికారులు పేర్కొన్నారు.అయితే, భవనాలకు ఎటువంటి నష్టం జరగలేదు. 

Aslo Read: Kohli: ఇదో అద్భుత విజయం..చెప్పడానికి మాటలు రావడం లేదు: కోహ్లీ!


ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండడంతో అందరూ భయాందోళనలకు గురవుతున్నారు. ఆ వీడియోల్లో విమానం శిథిలాలు మంటల్లో చిక్కుకున్నట్లు కనిపిస్తున్నాయి. 

ఈ సంఘటన తర్వాత, అగ్నిమాపక దళం వాహనాలు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. ఈ ప్రమాదం కారణంగా పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్షి ఒకరు మాట్లాడుతూ, ఒక విమానం అకస్మాత్తుగా ఎడమవైపుకు తిరిగి కూలిపోయిందని, కొద్దిసేపటికే మంటలు చెలరేగాయని చెప్పారు. 

Also Read: Nagababu: నాగబాబుకు రూ.59 కోట్ల ఆస్తి, బెంజ్ కారు.. చిరు, పవన్ దగ్గర అప్పు.. అఫిడవిట్ లో ఆసక్తికర విషయాలు!

Also Read:  Rains: రైతులకు షాక్.. ఈ ఏడాది వానలు అంతంత మాత్రమే.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే!?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు