/rtv/media/media_files/2025/08/16/trump-about-meeting-2025-08-16-09-21-20.jpg)
Trump about meeting
అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈరోజు భేటీ అయ్యారు. ఇందులో ఉక్రెయిన్ తో యుద్ధంపై చర్చించారు. అయితే ఎటువంటి డీల్ లేకుండానే ఈ కీలక భేటీ ముగిసింది. కానీ చర్చల్లో గొప్ప పురోగతి ఉందని ట్రంప్ చెప్పారు. మీటింగ్ తర్వాత అమెరికా అధ్యక్షుడు ఫాక్స్ న్యూస్ ప్రతినిధి సియాన్ హానిటీతో మాట్లాడారు. ఇందులో డీల్ పూర్తికావడం ఇక మీదట ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ చేతుల్లోనే ఉందని అన్నారు. ఒప్పందం చేసుకోవాలని జెలెన్ స్కీ కి చెప్తాను..కానీ వాళ్ళు దానికి ఒప్పుకుంటారో లేదో తెలియదు. మరికొద్ది రోజుల్లోనే పుతిన్, జెలెన్ స్కీల మధ్య సమావేశం జరుగుతుందని ఆశిస్తున్నా. దానికి నేను కూడా పాల్గొనే అవకాశం ఉంది అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు.
🇺🇸 Trump gave an interview to Fox News after meeting with Putin.
— Peacemaker (@peacemaket71) August 16, 2025
Trump said that a lot of progress was made during the talks with Putin.
And after meeting with Putin, he said that there is a "pretty high probability" of concluding a settlement agreement in Ukraine.
Trump also… pic.twitter.com/OE7FoW3BVk
Also Read: No Tariffs Talks: సుంకాలపై భారత్ కు తప్పని నిరాశ..ఆ వూసే ఎత్తని అధినేతలు
మేము రెడీగానే ఉన్నాం..
రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఏ అంశాలు చర్చకు వచ్చాయనే అంశంపై ట్రంప్ మాట్లాడ్డానికి నిరాకరించారు. కానీ రష్యా చాలా శక్తివంతమైన దేశమని అన్నారు. అంతకు ముందు పుతిన్ శాంతి ఒప్పందానికి తాము సానుకూలమేనని సంకేతం ఇచ్చారు. జెలెన్‌స్కీతో భేటీ అయ్యేందుకు వ్యతిరేకం కాదని, కొన్ని షరతులకు తప్పనిసరిగా అంగీకరించాలన్నారు. ఏదైనా భేటీ తర్వాతనే అని స్పష్టం చేశారు.