/rtv/media/media_files/2025/08/16/jobs-2025-08-16-07-03-08.jpg)
TSLPRB: తెలంగాణలో 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Job Notification) విడుదల అయింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీజీఎల్పీ ఆర్బీ) శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మల్టీ జోన్-1లో 50 పోస్టులు, మల్టీ జోన్-2లో 68 పోస్టులు భర్తీ చేయనున్నట్టు టీజీఎల్పీఆర్బీ డైరెక్టర్ వీవీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆన్లైన్ దరఖాస్తు తేదీలను తర్వలోనే వెల్లడిస్తామన్నారు. దీనికి లా డిగ్రీ (LL.B లేదా B.L) పూర్తి చేసి ఉండాలి. బార్ కౌన్సిల్‌లో ఎన్రోల్ అయ్యి, తెలంగాణలోని క్రిమినల్ కోర్టుల్లో కనీసం 3 సంవత్సరాలు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉండాలి. వయస్సు 2025 జూలై 1వ తేదీకి 34 ఏళ్లు మించి ఉండకూడదు. రిజర్వేషన్ల వారీగా మినహాయింపులుంటాయి.
Also Read: Swiggy: మళ్ళీ స్విగ్గీ వాయింపు ..భారీగా ప్లాట్ ఫామ్ ఫీజు పెంపు
నెలకు జీతం రూ. 54,220 నుంచి
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు, ఎక్స్ సర్వీస్మెన్ (ఇండియన్ ఆర్మీ లేదా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లేదా ఇండియన్ నేవీలో పనిచేసిన వారికి మాత్రమే) మూడేళ్ల సడలింపు వర్తిస్తుంది. నెలకు జీతం రూ. 54,220 నుంచి రూ. 1,33,630 వరకు ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా జరుగుతుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం అభ్యర్థులు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ www.tslprb.in ను సందర్శించవచ్చు. దరఖాస్తు తేదీలు, ఎంపిక ప్రక్రియ, పరీక్షా సిలబస్ వంటి పూర్తి సమాచారం త్వరలో అధికారికంగా విడుదల కానుంది.