Trump: క్యాపిటల్‌ భవనం ముందు ట్రంప్ విగ్రహం.. చేతిలో బిట్‌కాయిన్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకునే నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా ఆ దేశ క్యాపిటల్ భవనం ఎదురుగా ట్రంప్ బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆయన చేతిలో బిట్‌ కాయిన్‌ పట్టుకుని ఉన్నట్లు ఆ విగ్రహాన్ని రూపొందించారు.

New Update
12-foot golden statue of Trump holding Bitcoin unveiled outside US Capitol

12-foot golden statue of Trump holding Bitcoin unveiled outside US Capitol

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకునే నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా ఆ దేశ క్యాపిటల్ భవనం ఎదురుగా ట్రంప్ బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆయన చేతిలో బిట్‌ కాయిన్‌ పట్టుకుని ఉన్నట్లు ఆ విగ్రహాన్ని రూపొందించారు. ఇటీవల అమెరికా ఫెడరల్ రిజర్వు 25 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్ల కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ట్రంప్‌ విగ్రహం ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Also Read: జపాన్‌లో లక్ష మందికి 100 ఏళ్లకు పైగా ఆయుష్షు.. వాళ్ల హెల్త్ సీక్రెట్ ఏంటో తెలుసా?

ఆ విగ్రహం 12 అడుగుల ఎత్తు, బిట్‌కాయిన్‌ను చేతిలో పట్టుకుని ఉన్నట్లు తయారుచేశారు. క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారులే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు నిధులు సమకూర్చినట్లు వార్తలు వస్తున్నాయి. భవిష్యత్తు డిజిటల్ కరెన్సీ, ద్రవ్య విధానం, అలాగే ఆర్థిక మార్కెట్‌లో ఫెడరల్‌ ప్రభుత్వ విధానాల గురించి చర్చించుకునేలా చేసేందుకే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. కొంతమంది దీన్ని సపోర్ట్ చేయగా.. మరికొందరు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. 

Also Read: ఒక్కటవుతున్న పాక్, సౌదీ అరేబియా...భారత్ ఎదుట బిగ్ సవాల్

ఇదిలాఉండగా ఇటీవల అమెరికా ఫెడరల్ రిజర్వు 25 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ కోత విధించారు. ఏడాది తర్వాత ఈ రేట్లను మొదటిసారిగా తగ్గించారు. ప్రస్తుతం అమెరికాలో ద్రవ్యోల్బణం పేరుగుతోంది. కానీ కార్మిక మార్కెట్‌ మందగిస్తోంది. దీనికి ఊతం ఇవ్వడమే టార్గెట్‌గా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ఏడాదిలో మరో రెండుసార్లు వడ్డీరేట్లకు కోత విధించే అవకాశం ఉందని ఫెడరల్ అధికారులు పేర్కొన్నారు.   

Also Read: భారత్ తో సహా ఆ దేశాలన్నీ డ్రగ్స్ ఉత్పత్తి కేంద్రాలు..ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు