/rtv/media/media_files/2025/09/15/trump-2025-09-15-19-42-06.jpg)
Trump
భారత్ తో స్నేహం తిరిగి పెంపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్...ఇండియా మీద ఉన్న కక్షను మాత్రం వదిలిపెట్టడం లేదు. సమయం దొరికినప్పుడల్లా భారత్ ను ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. తాజాగా మరోసారి ఇండియాపై నోరు పారేసుకున్నారు. భారత్ తో సహా 23 దేశాలు డ్రగ్స్ ఉత్పత్తి చేస్తున్నాయని..రవాణా స్థావరాలుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లు కూడా ఈ లిస్ట్ లో ఉన్నాయని అన్నారు. ఈ దేశాలన్నీ అక్రమంగా డ్రగ్స్ ను రవాణా చేస్తూ అమెరికా ప్రజలకు ముప్పుగా మారాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మాదక ద్రవ్యాలపై యుద్ధం
సోమవారం అమెరికన్ కాంగ్రెస్ కు సమర్పించిన ప్రెసిడెన్షియల్ డిటర్మినేషన్ నివేదికలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ఆరోపణలను చేశారు. భారత్, పాకిస్థాన్, చైనా, అఫ్గానిస్థాన్, ద బహమాస్, బెలీజ్, బొలీవియా, బర్మా, కొలంబియా, కోస్టారికా, ద డొమినికన్ రిపబ్లిక్, ఈక్వెడార్, ఎల్ సాల్వడార్, గ్వాటెమాలా, హైతీ, హోండురస్, జమైకా, లావోస్, మెక్సికో, నికరాగువ, పనామా, పెరూ, వెనెజువెలా దేశాలు ప్రధానంగా డ్రగ్స్ ను ఉత్పత్తి చేయడంతోపాటు రవాణా చేస్తున్నాయని చెప్పారు.
ఈ 23 దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్, బొలివీయా, బర్మా, కొలంబియా, వెనిజులా కంట్రీస్...పూర్తిగా హద్దులు దాటాయని ట్రంప్ ఇంతకు ముందే చెప్పారు. ప్రస్తుతం వెనిజులా పై యుద్ధానికి కూడా దిగారు. ఉత్పత్తి, వాణిజ్యం, రవాణాలపై నిషేధం ఉన్నప్పటికీ ఈ దేశాలు మాదక ద్రవ్యాల కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని ట్రంప్ అన్నారు. సింథటిక్ ఓపియాయిడ్స్, ఫెంటానిల్ లు అమెరికాలో ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయని చెప్పారు. 18 నుంచి 44 ఏళ్ళ గల అమెరికన్లు డ్రగ్స్ కారణంగా చనిపోతున్నారని లెక్కలు చూపించారు. ఫెంటానిల్ సరఫరాకు ముఖ్యంగా చైనా అతి పెద్ద వనరుగా ఉందని ట్రంప్ ఆరోపించారు. మాదక ద్రవ్యాల ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందడంలో ఆ దేశం ప్రధాన పాత్ర పోషిస్తోందని అన్నారు. దీనిని తాము ఎలా అయినా అడ్డుకుంటామని ట్రంప్ చెప్పారు.