/rtv/media/media_files/2025/09/18/japanese-health-secret-2025-09-18-13-25-56.jpg)
Japanese Health Secret
జపాన్‌లో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం 100 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి సంఖ్య దాదాపుగా లక్షకు చేరువైనట్లు తెలుస్తోంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే జపనీయులు ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తారు. అయితే జపాన్ ప్రజలు 100 ఏళ్ల వరకు ఆరోగ్యంగా జీవించడానికి గల కారణాలు ఏంటి? ముఖ్యంగా వారి హెల్త్ సీక్రెట్ ఏంటి? అనే విషయాలు మీకు తెలియాలంటే స్టోరీపై ఓ లుక్కేయాల్సిందే.
ఇది కూడా చూడండి: PM Narendra Modi: 75 ఏళ్ల వయస్సులోనూ ఫిట్.. ప్రధాని మోదీ హెల్తీ డైట్ ఏంటో మీకు తెలుసా?
హరా హచ్ బన్ మీ
జపాన్ ప్రజలు హరా హట్ బన్ మీ సామెతను పాటిస్తారు. అంటే ఎక్కువగా తినకుండా 80 శాతం మాత్రమే తింటారు. దీనివల్ల పేగులు ఆరోగ్యంగా ఉంటాయని జపనీస్ ప్రజలు నమ్ముతారు. ఇదే రూల్‌ను జపనీస్ ప్రజలు ఇప్పటికీ పాటిస్తుంటారు.
భోజనం చేసేటప్పుడు ఈ నియమాలు
జపనీయులు పెద్ద ప్లేట్లలో కాకుండా చిన్న వాటిలో వడ్డించుకుని తింటారు. చైర్ వంటిపై కాకుండా నేలపై కూర్చోని కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో సంతోషంగా భోజనం చేస్తారు. అలాగే టీవీ, మొబైల్ వంటివి చూడకుండా నెమ్మదిగా నములుతూ తింటారు. వీటివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఎన్నేళ్లు అయినా కూడా జీవిస్తామని జపనీయులు చెబుతున్నారు.
వీటిని అసలు తీసుకోరు
జపనీయులు పుట్టినప్పటి నుంచి అన్ని టీకాలు వేయించుకుంటారు. అలాగే ఉప్పును తక్కువగా వినియోగిస్తారు. అలాగే పంచదార వంటి వాటికి కూడా దూరంగా ఉంటారు. వీటివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు.
తినే ఫుడ్
జపనీయులు ఎక్కువగా సముద్రపు చేపలు, పండ్లు, తృణధాన్యాలు, సోయా, మిసో, ముడి కూరగాయలు వంటివి తీసుకుంటారు. వీటిలో సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి ఊబకాయం, గుండెపోటు వంటి సమస్యలు రాకుండా చేస్తాయని నిపుణులు అంటున్నారు.
వ్యాయామం
డైలీ జపనీయులు వ్యాయామం చేస్తారు. వాకింగ్ చేయడంతో పాటు యోగా, మెడిటేషన్ వంటివి చేస్తుంటారు. ఈ దేశంలో ఎక్కువగా సైకిల్ వంటివి తొక్కుతుంటారు. వీటివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు.
కుటుంబ సభ్యులతో సమయం గడపడం
జపనీయులు ఒంటరి జీవితం కంటే ఎక్కువగా కుటుంబంతో సమయం గడుపుతారు. ఎంత వర్క్ బిజీలా ఉన్నా కూడా కుటుంబానికి సమయం ఇస్తుంటారు. వారు ఆరోగ్యంగా ఎక్కువ ఏళ్లు జీవించడానికి ఇది కూడా ముఖ్య కారణమే.
ఇకిగాయ్
జపనీయులు ఎక్కువగా ఇకిగాయ్‌ను ఫాలో అవుతుంటారు. ఇకిగాయ్ అంటే ఉన్నదానిలోనే ఆనందంగా జీవించాలనే రూల్ పాటిస్తారు. అయితే పురుషుల కంటే మహిళలు ఎక్కువ ఆయుష్షుతో జీవిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Financial Issues: ఆర్థిక సమస్యల వేధింపులు భరించలేకపోతున్నారా.. ఇలా చేస్తే చాలు.. మీ ఇంటి నిండా డబ్బే డబ్బు
Japan sets new record for the number centenarians — and here’s how they live to 100 https://t.co/lqTpNNiFmqpic.twitter.com/nLKxtUp4Ab
— New York Post (@nypost) September 14, 2025