స్టాక్ మార్కెట్ ఈరోజు లాభాలతో పరుగులు పెడుతోంది. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా లాభంతో 78,750 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో, నిఫ్టీలో 50 పాయింట్లకు పైగా పెరిగి.. 23,800 స్థాయి వద్ద ట్రేడవుతోంది. ప్రారంభ ట్రేడింగ్ సమయంలో, 30 సెన్సెక్స్ స్టాక్‌లలో, 19 పెరగ్గా 11 క్షీణించాయి. ఈరోజు ఆటో, ఐటీ షేర్లలో మరింత వృద్ధి ఉంది. ఇదే సమయంలో బ్యాంకింగ్, ఎనర్జీ షేర్లలో తగ్గుదల కనిపించింది. బజాజ్‌ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్‌ఫిన్‌సర్వ్, జొమాటో, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభాల్లో ఉంటే.. ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, భారతీ ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్, సన్‌ఫార్మా, టెక్ మహీంద్రా, టీసీఎస్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. Also Read: Pushpa-2: పుష్ప–2 నిర్మాతలకు భారీ ఊరట–అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు వరుసగా రెండు రోజులు లాభాల్లో.. ప్రధాన స్టాక్స్‌ను మదుపర్లు కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీనివలన మార్కెట్ వృద్ధ చెందుతోందని నిపుణులు చెబుతున్నారు. కొత్త సంవత్సరంలో ఇది ఒక రకంగా శుభసూచకమని అన్నారు. ఇక డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 పైసలు తగ్గి 85.73 వద్ద కొనసాగుతోంది. మరోవైపు బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. ఈరోజు బంగారం రూ.421 పెరిగి.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,990గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,100గా ఉంది. ఇంకా ఈ ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక నిన్న కూడా అంటే జనవరి 1న స్టాక్ మార్కెట్‌లో పెరుగుదల కనిపించింది. సెన్సెక్స్ 368 పాయింట్ల లాభంతో 78,507 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 98 పాయింట్లు పెరిగి 23,742 వద్ద ముగిసింది. నిన్న సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 23 లాభపడగా, 7 పతనమయ్యాయి. 50 నిఫ్టీ స్టాక్స్‌లో 37 లాభపడగా, 13 పతనమయ్యాయి. ఆటో, బ్యాంకింగ్ షేర్లలో వృద్ధి కనిపించింది. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో క్షీణత కనిపించింది. Also Read: UN: ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో తాత్కాలిక సభ్య దేశంగా పాక్