ఉగ్రవాదం, ఇతర కారణాల వలన పాకిస్తాన్ ఇప్పటివరకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశం కాలేకపోయింది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ కు అవకాశం వచ్చింది. రొటేషన్ పద్ధతిలో తాత్కాలిక సభ్య దేశంగా ఆ దేశం చేరింది. రెండేళ్ల పాటు మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా కొనసాగనుందని ఐరాస భద్రతామండలి తెలిపింది. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పాక్ తన వంతుగా క్రియాశీలక పాత్ర పోషిస్తుందని ఐరాసలో పాకిస్తాన్ దౌత్యవేత్త మునీర్ అక్రమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్గత సమస్యలు, యూరప్, పశ్చిమాసియా, ఆఫ్రికాలో యుద్ధాల వేళ మండలిలో మాకు దక్కిన సభ్యత్వాన్ని సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు. దశాబ్దాల చరిత్ర కలిగిన భద్రతామండలిలో పాక్‌కు స్థానం లభించడం ఇది 8వ సారి. Also Read: USA: అమెరికా పిక్అప్ ట్రక్ విషాదం..ఉగ్రవాద చర్యేమోనని అనుమానం ఓటింగ్‌లో పాక్‌కు అనుకూలంగా.. ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా భద్రతా మండలి ఏర్పడి పదేళ్ళ అయింది. ఇది మొదట 53 దేశాలతో ప్రారంభం అయి ఇప్పుడు 193 దేశాలకు చేరింది. ప్రస్తుతం భద్రతా మండలిలో 15 దేశాలకు శాశ్వత సభ్యత్వం ఉంది. ఇందులో శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్‌లకు మాత్రమే వీటో అధికారం ఉండగా.. మిగతా 10 తాత్కాలిక సభ్య దేశాలు రొటేషన్ పద్ధతిలో మారతాయి. ఈ భద్రతా మండలి సర్వ ప్రతినిధి సభలో ఓటింగ్ చేపట్టగా 182 దేశాలు పాకిస్తాన్‌కు అనుకూలంగా ఓటు వేశాయి. మామూలుగా ఏ దేశానికి అయినా మూడింటి రెండొంతుల మెజారిటీ కావాలి ఇప్పుడు పాకిస్తాన్ కు అంతకు మించి మెజార్టీ వచ్చింది. అయితే పాక్‌తో పాటూ గ్రీస్, పనామా, డెన్మార్క్, సోమాలియాలు కూడా సభ్య దేశాలుగా చేరాయి. Also Read: Pushpa-2: పుష్ప–2 నిర్మాతలకు భారీ ఊరట–అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు