Greenland Gambit: గ్రీన్ ల్యాండ్ ను వదిలేదే ల్యా.. డెన్మార్క్, యూకే, ఫ్రాన్స్ దేశాలపై 10 శాతం సుంకాల మోత

గ్రీన్ లాండ్ ను అమెరికా స్వాధీనం చేసుకోవడానికి ఒప్పుకోమని అంటున్న దేశాలపై అమెరికా అధ్యక్షుడు దండయాత్ర మొదలుపెట్టారు. ఈ విషయంపై మద్దతు ఇవ్వని డెన్మార్, యూకే, ఫ్రాన్స్ దేశాలపై 10 శాతం సుంకాలను విధించారు. 

New Update
greenland-trump tariffs

greenland-trump tariffs

గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికా స్వాధీనం చేసుకోవడాన్ని వ్యతిరేకించిన కారణంగా డెన్మార్క్, యుకె, ఫ్రాన్స్‌తో సహా అనేక యూరోపియన్ దేశాలపై అధ్యక్షుడు ట్రంప్ 10% సుంకాన్ని ప్రకటించారు. ఫిబ్రవరి 1 నుండి ఆ దేశాలకు సుంకాలను అమలు అవుతాయని చెప్పారు. దీనికి సంబంధించి ట్రంప్ తన ట్రూత్ సోసల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఎవరు వ్యతిరేకించినా గ్రీన్ ల్యాండ్ ను వదిలేదే లేదని ట్రంప్ మరో సారి స్పష్టం చేశారు. అయితే సైనిక చర్యల విషయం మాత్రం ఏమీ మాట్లాడలేదు. డెన్మార్క్ , మిగతా దేశాలకు మరి కొంత సమయం ఇస్తున్నామని..జూన్ 1 లోగా తమకు మద్దుతు ఇవ్వాలని ట్రంప్ తెలిపారు. జూన్ 1 లోపు గ్రీన్ లాండ్ పై ఎటువంటి ఒప్పందం కుదరకపోతే టారిఫ్ లు 25 శాతానికి పెరుగుతాయని హెచ్చరించారు.

బెదిరింపులు సరికాదు..

మరోవైపు గ్రీన్ లాండ్ విషయంలో డెన్మార్క్ పట్టుదలతో ఉంది. డెన్మార్క్ తన మిత్రదేశాలతో సమన్వయంతో ఆ ప్రాంతంలో తన సైనిక ఉనికిని బలోపేతం చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 10 శాతం సుంకాలను విధించడాన్ని యూరప్ దేశాలు ఖండిస్తున్నాయి. మిత్ర దేశాలపై ట్రంప్ టారిఫ్స్ విధించడం సరైంది కాదని యూకే పీఎమ్ కీర్ స్టార్మర్ పేర్కొన్నారు. టారిఫ్స్‌తో బెదిరింపులకు దిగడం ఆమోదయోగ్యం కాదని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తెలిపారు. తామెప్పుడూ తమ, పొరుగు దేశాల శ్రేయస్సు కోసం తప్పకుండా నిలబడతామని స్వీడన్ పీఎం క్రిస్టెర్సన్ స్పష్టం చేశారు.

అమెరికా ప్రయోజనాలే ముఖ్యం..

24 గంటల క్రితమే గ్రీన్ ల్యాండ్ కు సంబంధించి అమెరికాను సమర్థించని దేశాలు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తనకు మద్దతు ఇవ్వని దేశాలపై భారీ సుంకాలను విధించవచ్చని ట్రంప్ సూచించారు. గ్రీన్‌ల్యాండ్ సమస్యపై డోనాల్డ్ ట్రంప్ ఇప్పటివరకు చేసిన బలమైన హెచ్చరిక ఇదేనని చెబుతున్నారు. ఇది అయిన ఒక రోజులోనే ఆ దేశాలపై టారిఫ్ ల అస్త్రాన్ని సంధించారు. గ్రీన్‌ల్యాండ్ అమెరికా జాతీయ భద్రతకు చాలా ముఖ్యమైనదని, అందువల్ల దానిపై అమెరికా నియంత్రణ అవసరమని ఆయన వాదిస్తున్నారు. ఏదైనా దేశం అమెరికా ప్రణాళికకు మద్దతు ఇవ్వకపోతే సుంకాల ద్వారా ఆర్థిక ఒత్తిడి పెరుగుతుందని అన్నారు. అమెరికా భద్రతా వ్యూహంలో గ్రీన్‌ల్యాండ్ ఒక ముఖ్యమైన భాగమని, దాని గురించి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా తాను వెనుకాడనని ట్రంప్ అన్నారు. ఈ విషయంలో డెన్మార్క్ ను పెద్దగా పట్టించుకోమని చెప్పారు. కానీ డెన్మార్క్, గ్రీన్‌ల్యాండ్ తో పాటూ మిగతా యూరోపియన్ దేశాలు ఈ అభిప్రాయంతో విభేదిస్తున్నాయి. అమెరికా తన ప్రయోజనాలను సాధించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయని అన్నారు. ఏదైనా దేశం అమెరికా ప్రణాళికకు మద్దతు ఇవ్వకపోతే సుంకాల ద్వారా ఆర్థిక ఒత్తిడి పెరుగుతుందని అంటున్నాయి. 

Advertisment
తాజా కథనాలు