/rtv/media/media_files/2025/10/19/kitchen-tips-2025-10-19-15-06-31.jpg)
Kitchen Tips
Kitchen Tips: దీపావళి పండుగ(Diwali Special) సమీపిస్తున్న నేపథ్యంలో.. ఇళ్ల శుభ్రత కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ ఏడాది అక్టోబరు 20వ తేదీన దీపావళి జరుపుకోనున్న సందర్భంగా.. ప్రజలు తమ ఇళ్లను మెరిపించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ శుభ్రత ప్రయత్నాలలో అడ్డుగా నిలిచే ప్రధాన సమస్య ఎలుకల బెడద. ఈ చిన్న జీవులు వంటగది, స్టోర్ రూమ్, వార్డ్‌రోబ్‌లను ముట్టడించి, విలువైన వస్తువులను కొరికి, దుర్వాసనను వ్యాప్తి చేస్తాయి. ఇంట్లోనూ ఎలుకల సమస్య తీవ్రంగా ఉంటే.. వాటిని చంపకుండా సులభంగా పారదోలేందుకు ఉపయోగపడే చిట్కాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఈ పద్ధతి చాలా చౌకగా, సులభంగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి: గచ్చిబౌలిలో విషాదం.. నీటి సంపులో పడి నాలుగేళ్ల బాలుడు మృతి
ఎలుకల బెడదకు చెక్..
ఈ చిట్కా కోసం కొన్ని పదార్థాలు అవసరం ఉంటుంది. గోధుమ పిండి 2 టేబుల్‌స్పూన్లు, కొద్దిగా నెయ్యి, చక్కెర, కొద్దిగా డిటర్జెంట్ పౌడర్, ఫినైల్ బిళ్ళలు సిద్దంగా పెట్టుకోవాలి. ముందుగా ఒక గిన్నెలో రెండు టేబుల్‌స్పూన్ల గోధుమ పిండి తీసుకోవాలి. దానికి కొద్దిగా నెయ్యి, చక్కెర కలిపి.. కొద్దిగా నీళ్లు పోసి మృదువుగా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా కాకుండా మెత్తగా ఉండాలి. ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చుట్టాలి. ప్రతి ఉండను మధ్యలో కొద్దిగా తెరిచి.. దాని నిండా కొద్దిగా డిటర్జెంట్ పౌడర్, ఫినైల్ బిళ్లల పౌడర్ నింపాలి. తరువాత ఆ ఉండలను మళ్లీ మూసి.. చిన్న గోళీలుగా తయారు చేయాలి.
ఇది కూడా చదవండి: తెల్లటి ఆహార పదార్థాలు విషమా లేక అమృతమా..!!
ఈ గోళీలను వంటగది మూలలు, రిఫ్రిజిరేటర్ వెనుక, అల్మారా కింద, స్టోర్ రూమ్ వంటి ఎలుకలు తరచుగా కనిపించే ప్రాంతాల్లో ఉంచాలి. నెయ్యి, చక్కెర వాసనకు ఎలుకలు ఈ ఉండల వైపు ఆకర్షితమవుతాయి. వాటిని రుచి చూడగానే.. డిటర్జెంట్, ఫినైల్ యొక్క ఘాటైన వాసన, రుచి వాటిని తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. దీనివల్ల ఎలుకలు ఆ ఇంటికి మళ్లీ రాకుండా పారిపోతాయి. ఈ సులభమైన ఉపాయంతో ఎలుకల బెడద నుంచి విముక్తి పొందవచ్చని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: తీర్థయాత్రకు వెళ్లివస్తుండగా.. రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి: సోన్ పాపిడి మిఠాయి పుట్టింది మన దేశంలోనేనా..?