/rtv/media/media_files/2025/10/19/sohan-papdi-2025-10-19-13-28-22.jpg)
Sohan Papdi
దీపావళి పండుగ వచ్చిందంటే చాలు.. ప్రతి ఇంట్లో సోన్ పాపిడి పెట్టెల సందడి మొదలవుతుంది. స్నేహితులు, బంధువులు, పొరుగువారికి పంచుకునే ఈ తీపి అప్పుడప్పుడు జోకులకు, మీమ్స్‌కు కేంద్రబిందువుగా మారుతుంది. అయితే ఈ పాపులర్ స్వీట్ గురించి చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. సోన్ పాపిడికి అనేక పేర్లు ఉన్నాయి. దీనిని సాధారణంగా సన్ పాప్రి (Soan Papri), షోంపప్రి (Shompapri), సోహన్ పాపడి (Sohan Papdi) అని పిలుస్తారు. కానీ చాలామందికి తెలియని పేరు పతీసా (Patisa). సోన్ పాపిడి చాలా మెత్తగా.. నోట్లో కరిగిపోయేలా ఉంటే.. పతీసా కొద్దిగా గట్టిగా, సన్నని పొరలుగా ఉంటుంది. ఇది కూడా సోన్ పాపిడి లాంటిదే.
సోన్ పాపిడి గురించి ఆసక్తికరమైన విషయాలు..
సోన్ పాపిడి పుట్టుక గురించి స్పష్టమైన ఆధారం లేదు. ఇది దక్షిణాసియా స్వీట్‌గా చెప్పిన్నప్పటికీ.. దీని చరిత్రపై అనేక వాదనలు ఉన్నాయి.
కొంతమంది ఇది రాజస్థాన్ రాష్ట్రంలో పుట్టిందని చెబితే, మరికొందరు మహారాష్ట్ర ప్రాంతం నుంచి వచ్చిందని వాదిస్తారు. అయితే తుర్కియే (Turkey) దేశంలోని పిస్మానియే (Pismaniye) అనే తీపికి సోన్ పాపిడి చాలా దగ్గర పోలికలు కలిగి ఉంటుంది. పిస్మానియే గోధుమ పిండితో తయారు చేస్తే.. సోన్ పాపిడి శనగ పిండితో తయారు చేస్తారు. అయితే కచ్చితంగా ఎవరు కనిపెట్టారో తెలియకపోయినా.. భారత్‌లోని ప్రాంతీయ భాగం చేశారు.
ఇది కూడా చదవండి: దీపావళి వేళ మార్కెట్లో భారీగా నకిలీ పనీర్.. ఈ సింపుల్ చిట్కాతో ఇట్టే గుర్తు పట్టండి!!
సోన్ పాపిడి అనేది శనగ పిండి, మైదా పిండి, పంచదార పాకంతో తయారు చేసే తీపి పదర్థారం. ఇది నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే పొరల రూపంలో ఉంటుంది. ముఖ్యంగా దీపావళికి దీన్ని బహుమతిగా ఇవ్వడం ఒక సంప్రదాయంగా మారిపోయింది. ఈ స్వీట్ తక్కువ ధరలో లభించడం, మరియు ఎక్కువ రోజులు నిల్వ ఉండటం కూడా దీని పాపులారిటీకి కారణాలు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి: రోజుకు రెండు ఖర్జూర పండ్లు.. ఎన్నెన్నో ప్రయోజనాలు