GHMC MAYOR: గ్రేటర్‌ మేయర్‌ పీఠం ఉండేనా? ఊడేనా? బీఆర్‌ఎస్‌ పక్కా ప్లాన్‌

గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్‌ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. మేయర్ అవిశ్వాసం అంశం చర్చనీయంశమైంది. ఎట్టిపరిస్థితుల్లోనూ అవిశ్వాసంపెట్టి తీరాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. అయితే బీఆర్ఎస్ కు ధీటుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తోంది.

New Update
GHMC elections for new mayor

GHMC elections for new mayor,

గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్‌ (Greater Hyderabad Corporation) రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. మేయర్ పై అవిశ్వాసం విషయం చర్చనీయంశమైంది. ఎట్టిపరిస్థితుల్లోనూ అవిశ్వాసం పెట్టి తీరాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. అయితే బీఆర్ఎస్ కు ధీటుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తోంది. ప్రస్తుత మేయర్‌ పదవికాలం ఫిబ్రవరి 11న నాలుగేళ్లకు చేరుకుంటుంది. అవిశ్వాసం పెట్టేందుకు ఈ నెల 11 తరువాత అవకాశం దక్కుతుంది. దీంతో, బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ అవిశ్వాసం పెట్టాలని భావిస్తుండగా, దాన్ని ధీటుగా ఎదుర్కోవాలని అధికార కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తోంది.

ఇది కూడా చదవండి: నాలుకపై ఎరుపు, తెలుపు మచ్చలు క్యాన్సర్ సంకేతమా?

GHMC Mayor

ఇప్పటికే మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసం దిశగా బీఆర్ఎస్ (BRS) పావులు కదుపుతోంది. ఫిబ్రవరి 11తో  గ్రేటర్ పాలక మండలికి నాలుగేళ్లు పూర్తి కానుంది. దీంతో, 11వ తేదీ తరువాత ఎప్పుడైనా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు అవకాశం దక్కుతుంది. బీఆర్ఎస్ ఇప్పటికే జీహెచ్ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలత శోభన్‌ రెడ్డిలపై అవిశ్వాసం పెట్టేందుకు కసరత్తు ప్రారంభించింది. దీంతో, గ్రేటర్ లో పార్టీల బలబలాలు కీలకంగా మారుతున్నాయి. గత పురపాలక ఎన్నికల్లో జీహెచ్‌ఎంసీ పీఠం దక్కించుకున్న బీఆర్‌ఎస్‌ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్‌ పలువురు కార్పొరేటర్లు కారు దిగి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. దీంతో వారిపై ఎట్టిపరిస్థితుల్లోనూ అవిశ్వాసం పెట్టాలని బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోంది.

ఇది కూడా చదవండి: West Bengal: వెస్ట్‌ బెంగాల్‌లో అనుమానస్పద రేడియో సిగ్నల్స్.. ఉగ్రకుట్రనా ?

దీనికోసం మాజీమంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) తో బీఆర్‌ఎస్‌ కార్పోరేటర్లు సోమవారం సమావేశం కానున్నారు. సమావేశానికి హజరయ్యే కార్పొరేటర్ల సంఖ్యను బట్టి అవిశ్వాసం పెట్టాలా వద్దా అనేది నిర్ణయం తీసుకోనున్నారు. అదే సమయంలో బీజేపీ కార్పోరేటర్లతో కేంద్రమంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి సమావేశం కానున్నారు. కాగా పార్టీమారిన వారిపై అవిశ్వాసం పెట్టాలని గులాబీ కార్పోరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మంత్రాంగంతో కాంగ్రెస్ అప్రమత్తం అయింది. మంగళవారం కాంగ్రెస్ కార్పోరేటర్లతో మేయర్ సమావేశం కానున్నారు. 

ఇది కూడా చూడండి: Sankranthiki Vasthunam: వెంకీ మామ ఫ్యాన్స్ గెట్ రెడీ.. యూట్యూబ్ లో 'గోదారి గట్టు మీద' సాంగ్ ఫుల్ వీడియో

తమ పార్టీ తరఫున కార్పొరేటర్‌గా గెలిచి జీహెచ్‌ఎంసీ మేయర్‌ పదవిని చేపట్టిన విజయలక్ష్మి కాంగ్రెస్‌లోకి మారటంతో బీఆర్ఎస్ ఈ అవిశ్వాస తీర్మానం పైన ఆలోచన చేస్తోంది. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. బలబలాల పైన సమీక్షించారు. అవిశ్వాసం పెడితే గెలిచే అవకాశం ఉందా.. ఎవరెవరు మద్దతిస్తారనేది చర్చించారు. అయితే, అటు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల పైన నిర్ణయం తీసుకుంటుందనే చర్చ వేళ బీఆర్ఎస్ ఆచితూచి వ్యవహరించా లని భావిస్తోంది. దీంతో.. గ్రేటర్ రాజకీయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. 

ఇది కూడా చూడండి: Pakistan PM : పరువు తీయొద్దు .. భారత్ పై గెలవండి..కప్ తీసుకురండి :  పాక్ ప్రధాని

అయితే ప్రస్తుత మేయర్‌ విజయలక్ష్మిపై సొంతపార్టీ కార్పోరేటర్లలోనే వ్యతిరేకత ఉంది. అలాగే బీజేపీ కూడా ఆమెకు వ్యతిరేకంగానే ఓటు వేయాలనుకుంటోంది. విజయలక్ష్మి స్థానంలో మరెవరున్న మద్ధతు ఇచ్చేవారిమని ఎంఐఎం కార్పోరేటర్లు కూడా స్పష్టం చేస్తున్నారట. విజయలక్ష్మి తీరు పలుమార్లు వివాదస్పదంగా మారిన సందర్భాలున్నాయి. సొంతపార్టీ కార్పోరేటర్లతోనూ ఆమెకు విభేదాలున్నాయి. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ పెట్టే అవిశ్వాసంతో సంబంధం లేకుండా ఆమెకు వ్యతిరేకంగా ఓటు వేయడానికే పలువురు కార్పోరేటర్లు ఆసక్తి చూపుతున్నారట. దీంతో ఆమె పీఠం ఉంటుందా? ఊడుతుందా? అనే సందిగ్ధత కాంగ్రెస్‌ లో మొదలైంది.

ఇది కూడా చూడండి: Mastan sai: టాలీవుడ్ To పాలిటిక్స్ ఎవరిని వదలని మస్తాన్ సాయి: టోటల్ లిస్ట్ ఆడియో వైరల్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు