Pakistan PM : పరువు తీయొద్దు .. భారత్ పై గెలవండి..కప్ తీసుకురండి :  పాక్ ప్రధాని

రాబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో గెలవడమే కాకుండా భారత్‌ను ఓడించడం పాకిస్థాన్‌కు నిజమైన సవాలు అని పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ దుబాయ్‌లో జరుగుతుంది.

New Update
ind vs pak match

ind vs pak match

రాబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (ICC Champions Trophy 2025) లో గెలవడమే కాకుండా భారత్‌ను ఓడించడం పాకిస్థాన్‌కు నిజమైన సవాలు అని పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది, పాకిస్తాన్, దుబాయ్ కలిసి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ టోర్నమెంట్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23 ఆదివారం దుబాయ్‌లో జరుగుతుంది. ఈ క్రమంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తమ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. 

Also Read :  టాలీవుడ్ To పాలిటిక్స్ ఎవరిని వదలని మస్తాన్ సాయి: టోటల్ లిస్ట్ ఆడియో వైరల్!

మన జట్టు చాలా బాగుంది

గడాఫీ స్టేడియం (Gaddafi Stadium) ప్రారంభోత్సవంలో షరీఫ్  మాట్లాడుతూ..  "మన జట్టు చాలా బాగుంది, ఇటీవలి కాలంలో బాగా రాణించారు, కానీ ఇప్పుడు నిజమైన టాస్క్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం.  అంతేకాకుండా దుబాయ్‌లో జరగనున్న మ్యాచ్‌లో మన చిరకాల ప్రత్యర్థి భారత్‌ను ఓడించడం. దేశం మొత్తం మీ వెనుక ఉంది." అని షరీఫ్ అన్నారు. పాకిస్తాన్ 29 సంవత్సరాల తర్వాత ఐసీసీ ఈవెంట్‌ను నిర్వహించడం గొప్ప సందర్భమని షరీఫ్ అభిప్రాయపడ్డారు.  ఎందుకంటే 1996లో చివరిసారిగా భారత్, శ్రీలంకతో కలిసి వన్డే ప్రపంచ కప్‌ను నిర్వహించింది పాక్.

Also Read :   రెండో వన్డేలో కోహ్లీ ఆడతాడా? లేదా?.. ఫిట్‌నెస్‌పై అప్‌డేట్‌ ఇచ్చిన బ్యాటింగ్ కోచ్!

దేశం గర్వపడేలా చేస్తుంది

దాదాపు 29 సంవత్సరాల తర్వాత ఐసీసీ నిర్వహించే ఒక పెద్ద ఈవెంట్‌ను పాకిస్థాన్ నిర్వహించడం చాలా గొప్ప సందర్భమని చెప్పిన  షరీఫ్  రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో మా జట్టు దేశం గర్వపడేలా చేస్తుందని తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. టీమ్ ఈ టోర్నీలో నిరాశపరచదన్నారు.  ఈ విషయంలో దేశం మొత్తం పాకిస్థాన్ జట్టుకు వెన్నుదన్నుగా నిలుస్తోందని వెల్లడించారు.  కాగా ఈ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా అడుగుపెడుతుంది. చివరిసారిగా 2017లో ఇంగ్లాండ్‌లో జరిగింది, ఫైనల్‌లో పాకిస్తాన్ గెలిచింది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో ఇరు జట్లు ఇప్పటివరకు 5 సార్లు తలపడగా..  అందులో భారత్ 2 సార్లు, పాకిస్తాన్ 3 సార్లు గెలిచాయి.

Also Read :  NZ vs Pak : ఈడ్చి కొట్టిన పాక్ బ్యాట్స్మెన్...  న్యూజిలాండ్ ఆటగాడికి తీవ్ర గాయం!

Also Read :  ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ.. ఫ్యాన్స్‌లో ఉత్తేజం నింపుతున్న జీతో బాజీ ఖేల్ కే సాంగ్

Advertisment
తాజా కథనాలు