MLA Danam Nagender: బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ కొడుతుంది: దానం ధీమా

తెలంగాణలో మరోసారి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందని ఖైరాతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే అందుకు కారణమన్నారు. కేసీఆర్‌ మరోసారి సీఎం అవ్వడం ఖాయమన్నారు.

New Update
MLA Danam Nagender: బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ కొడుతుంది: దానం ధీమా

MLA Danam Nagender - BRS Will Score Hat Trick: తెలంగాణలో బీఆర్ఎస్‌ (BRS) హ్యాట్రిక్‌ విజయం సాధిస్తుందని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. కేసీఆర్‌ (KCR) వరుసగా మూడో సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని ఆయన జోస్యం చెప్పారు. ఖైరతాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గత 9 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందని, అతి తక్కువ కాలంలోనే అభివృద్ధిలో నెంబర్‌ వన్‌గా నిలిచిందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హైదరాబాద్‌ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దిందన్నారు. ప్రస్తుతం పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న విదేశీ సంస్థలు దేశ వ్యాప్తంగా అనేక నగరాలు ఉన్నా.. సంస్థలను హైదరాబాద్‌లోనే స్థాపిస్తున్నారన్నారు.

అంతే కాకుండా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సార్టప్‌ కంపెనీలకు పెద్దపీఠ వేస్తుందని తెలిపారు. దీంతో నగరంలో అనేక మందికి ఉపాధి కల్పించినట్లు అవుతుందని దానం నాగేందర్‌ వెల్లడించారు. మరోవైపు విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే.. కాంగ్రెస్‌ (Congress), బీజేపీ (BJP) నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై ఇష్టంవచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు వచ్చి తమ నోటికి వచ్చిన హామీలు ఇస్తున్నారన్నారు. విపక్ష నేతలు ఇస్తున్న హామీలు అమలు అవుతాయే లేదో ప్రజలకు తెలుసన్నారు. అమలు కాని హామీలు ఇస్తున్న బీజేపీ నేతల మాటలు విని ప్రజలు మోసపోవద్దని సూచించారు.

మరోవైపు కాంగ్రెస్‌ నేతలు ప్రతీది రాజకీయం చేస్తున్నారని దానం నాగేందర్‌ ఆరోపించారు. దేవాలయాలను సైతం రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు సైతం కరువయ్యారని ఎద్దేవా చేశారు. కాగా తెలంగాణలో అనేక హామీలు ఇస్తున్న విపక్ష నేతలు.. కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముందు వాటిని అమలు చేయాలన్నారు. ఆ తర్వాతే తెలంగాణకు వచ్చి హామీలు ఇవ్వాలని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే సూచించారు.

Also Read: కాంగ్రెస్ దళితులను మోసం చేసే ప్రయత్నం చేస్తోంది: ఎమ్మెల్సీ కవిత

Advertisment
తాజా కథనాలు