ఆదిలాబాద్‌లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి

ఆదిలాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ వెళ్తున్న  ఓ ప్రైవేట్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. బస్సులోని పలువురికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆదిలాబాద్‌ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. 

New Update
ACCIDENT

ACCIDENT

ఆదిలాబాద్‌లో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ వెళ్తున్న  ఓ ప్రైవేట్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. దీంతో స్పాట్‌లోనే బస్సు డ్రైవర్, క్లీనర్ మృతి చెందగా.. పలువురికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆదిలాబాద్‌ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చూడండి: Lalith Modi: లలిత్ మోదీకి వనువాటు పౌరసత్వం..ఎంతకు కొన్నారో తెలుసా?

వైజాగ్‌లో మహిళ అనుమానస్పద మృతి..

ఇదిలా ఉండగా ఇటీవల వైజాగ్‌లో ఓ ఎన్‌ఆర్‌ఐ మహిళ మృతి చెందింది. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న హోటల్‌లో ఎన్ఆర్‌ఐ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. సీతమ్మధారకు చెందిన మహిళ(48) భర్త, పిల్లలతో అమెరికాలో ఉంటుంది. అయితే నగరానికి డాక్టర్ శ్రీధర్‌తో ఆమెకు స్నేహం ఏర్పడింది. అతను వైజాగ్‌లో ఓ హోటల్‌లో రూమ్ తీసుకుని ఉంటున్నాడు. ఓ స్థలం లీజ్ అగ్రిమెంట్ కోసం అమెరికా నుంచి వచ్చిన ఆ మహిళ కూడా  శ్రీధర్‌ గదిలోనే ఉంటుంది.

ఇది కూడా చూడండి: Horoscope Today: ఈ రోజు ఈ రాశి వారికి సొంత నిర్ణయాలు నష్టాన్ని తెచ్చిపెడతాయి.. జాగ్రత్త!

ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం బాత్రూంలో ఉన్న షవర్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు శ్రీధర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాత్రాంలో ఉరి వేసుకుని చనిపోయినట్లు ఎలాంటి కారణాలు కనిపించలేదు. అయితే ఆమె ఆత్మహత్యకు చేసుకోవడానికి ముందు శ్రీధర్‌తో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె మనస్తాపానికి చెంది ఆత్మహత్య చేసుకుందా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. లేకపోతే హత్యకు గురైందా అనే విషయాలపై ఇంకా క్లారిటీ రావాలి. 

ఇది కూడా చూడండి: TG News: మహిళలపై సీఎం రేవంత్ వరాల జల్లు.. ఇందిరా మహిళాశక్తి మిషన్-2025 పాలసీ ప్రకటన!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు