Road Accident: నల్లగొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే..

న‌ల్లగొండ జిల్లా నార్కెట్‌ప‌ల్లి మండలం ఏపీ లింగోటం దగ్గర కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయి, ప్రవీణ్ ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రికి త‌ర‌లించారు.

New Update
Road accident nalgonda

Road accident nalgonda

Road Accident: న‌ల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నార్కెట్‌ప‌ల్లి మండలం ఏపీ లింగోటం గ్రామ శివారు స‌మీపంలో జాతీయ ర‌హ‌దారి 65పై ఆదివారం తెల్లవారుజామున కారు అతి వేగంగా దూసుకొచ్చి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు అక్కడిక‌క్కడే దుర్మరణం పాలైయ్యారు. ప్రమాదంపై స‌మాచారం అందుకున్న ఎస్ఐ క్రాంతి కుమార్ ఘ‌ట‌నాస్థలానికి చేరుకున్నారు. ప్రమాద జరిగిన స్థలాన్ని.. ప‌రిస్థితిని పరిశీలించారు. మేడ్చల్ జిల్లా అల్వాల్‌కు చెందిన ఐదుగురు వ్యక్తులు విజ‌య‌వాడ‌కు కారులో వెళ్తున్నారు. ఏపీ లింగోటం దగ్గరకు రాగానే ఈ ప్రమాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు తెలిపారు.

అతి వేగంతో వచ్చి...

అయితే.. లారీని హైవేపై పక్కకు ఆపి డ్రైవర్‌ టీ తాగుతున్నాడు. ఆ స‌మ‌యంలో కారు వేగంగా వ‌చ్చి లారీని ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న సాయి, ప్రవీణ్ ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ముగ్గురు తీవ్ర గాయాల‌పాల‌య్యారు. ఆ ముగ్గురిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో నార్కెట్‌ప‌ల్లి కామినేని ఆస్పత్రికి త‌ర‌లించారు. అదేవిధంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ ఎక్కువగా ఉంటడంలో పోలీసులు వెంటనే దానిని క్లియర్ చేశారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు. అనంతరం ఎస్ఐ క్రాంతి కుమార్ మృతుల కుటుంబాల‌కు స‌మాచారం అందించారు.

ఇది కూడా చదవండి: పురుషుల అధిక బరువు పుట్టబోయే బిడ్డకు ప్రమాదకరం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు