/rtv/media/media_files/2025/03/08/P7jJyqLGDjF85DVHmD4M.jpg)
Chhattisgarh
Chhattisgarh:ఛత్తీస్‌గఢ్‌లో మందుపాతర పేలి మహిళకు తీవ్రగాయాలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీజాపూర్ జిల్లా రాంపురం గ్రామానికి చెందిన కుంజ పాండే అనే యువతి మూడురోజుల క్రితం కట్టెల కోసం అడవిలోకి వెళ్లింది. అయితే మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో కాలుతో పాటు చేతులకు తీవ్రగాయాలు అయ్యాయి. మారుమూల ఏజెన్సీ ప్రాంతం కావడంతో సరైన వైద్యం అందలేదు. అక్కడి నుంచి చర్ల మండలం వచ్చేసరికి 3 రోజులు పట్టింది.
Also Read: పెళ్లి చేసుకోకుండా శ్మశానవాటికలోనే.. ఈమెకు బతుకున్న మనుషులంటే భయమట!
Also Read: హిందీని బలవంతంగా రుద్దడం లేదు.. నారా లోకేశ్ సంచనల వ్యాఖ్యలు
తీవ్ర గాయం కావడంతో..
చర్ల పోలీసులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సిబ్బంది యువతిని భద్రాచలం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యువతి కుడి కాలికి తీవ్ర గాయం కావడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించి కాలు తొలగించాల్సి ఉంటుందని తెలిపారు. ఏజెన్సీలోని మారుమూల గ్రామం నుంచి రహదారి సౌకర్యం లేకపోవడంతో జెట్టి సహాయంతో ఈరోజు ఉదయం యువతి చర్ల సరిహద్దులోకి రావడంతో సీఆర్పీఎఫ్ పోలీసులు విషయం తెలుసుకుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Also Read:అయ్యో అశ్విని.. ఎంత పని చేశావమ్మా.. బాధలు బరించలేనంటూ రాసి..!
Also Read: లలిత్ మోదీకి వనువాటు పౌరసత్వం.. ఎంతకు కొన్నాడు..? ఆ దేశం ప్రత్యేకత ఏంటో తెలుసా?
Follow Us