AP Crime: తలదూర్చిందని తల నరికేశాడు.. ఏపీలో ఉమెన్స్ డే రోజు దారుణం!

ఉమెన్స్ డే రోజే ఏపీలో ఘోరం జరిగింది. ముమ్మిడివరం అనాతవరంలో మాలతి అనే పక్కింటి మహిళపై జయ రామకృష్ణ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. పిల్లల గొడవలే ఇందుకు కారణం కాగా మాలతి తల లోతుగా తెగింది. ఆమెను అస్పత్రికి తరలించి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

New Update
murder ap

murder ap Photograph: (murder ap)

AP Crime: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఏపీలో ఘోరం జరిగింది. పట్టపగలే ఓ వివాహితపై దాడి జరిగింది. eజిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం అనాతవరంలో మాలతి అనే పక్కింటి మహిళపై జయ రామకృష్ణ అనే వ్యక్తి కత్తితో అటాక్ చేశాడు. మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో అమలాపురం కిమ్స్ హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

పిల్లలు అల్లరి చేస్తున్నారని..

ఈ మేరకు అనాతవరంలో తన ఇంటి నుంచి మాలతి బయటకు వెళ్తోంది. ఈ క్రమంలోనే చుట్టుపక్కల పిల్లలు అల్లరి చేస్తుండగా చిన్నగా మందలించింది. అయితే అదే సమయంలో ఇంట్లో ఉన్న జయ రామకృష్ణ పిల్లలను ఎందుకు మందలిస్తున్నావంటూ మాలతితో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరగటంతో గొడవ పెద్దదైంది. క్షిణికావేశానికి లోనైన రామకృష్ణ కోపంలో కత్తితో మాలతి‌ మెడపై దాడి చేశాడు. ఆ కత్తి దాడికి మాతలి ఎడమవైపు తల లోతుగా తెగింది. 

Also read :  షాద్నగర్లో దారుణం.. ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే గొంతు కోశాడు!

దీంతో మాలతి అపస్మారక స్థితికి చేరడంతో అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. మాలతికి భర్త, కుమారుడు, కూతురు ఉన్నారు. నిందితుడు జయ రామకృష్ణ భార్య ఉపాధి నిమిత్తం గల్ఫ్ లో ఉండగా అతనికి ఇద్దరు కుమారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ముమ్మిడివరం సీఐ ఎం.మోహన్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్సై డి జ్వాలాసాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. 

Also Read: పెళ్లి చేసుకోకుండా శ్మశానవాటికలోనే.. ఈమెకు బతుకున్న మనుషులంటే భయమట!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు