India-Pak Match: పాకిస్థాన్‌తో మ్యాచ్‌లెందుకు.. BCCIపై శివసేన ఎంపీ ఫైర్

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌ (WCL) టోర్నీకి బీసీసీఐ (BCCI) పర్మిషన్ ఇవ్వడాన్ని శివసేన (UBT) ఎంపీ ప్రియాంక చతుర్వేతి ఖండించారు. పహల్గాం ఉగ్రవాదులను అరెస్టు చేయకముందే పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు ఆడటం కరెక్ట్ కాదని ధ్వజమెత్తారు.

New Update
Priyanka Chaturvedi

Priyanka Chaturvedi

జమ్మూకశ్మీర్‌లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌తో భారత్‌ అన్ని సంబంధాలు తెంచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌ (WCL) టోర్నీకి బీసీసీఐ (BCCI) పర్మిషన్ ఇచ్చింది. దీన్ని శివసేన (UBT) ఎంపీ ప్రియాంక చతుర్వేతి తీవ్రంగా ఖండించారు. పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత పాకిస్థాన్‌తో భారత్‌కు ఎలాంటి సంబంధాలు ఉండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని ఆమె తెలిపారు. ఈ దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను అరెస్టు చేయకముందే పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు ఆడటం కరెక్ట్ కాదని తేల్చిచెప్పారు. 

Also Read: ఒడిశాలో దారుణం.. బాలికకు నిప్పంటించిన దుండగులు

Priyanka Chaturvedi On Match With Pakistan

భారత్‌కు పాక్‌తో ఎలాంటి సంబంధాలు ఉండవని కేంద్రం చెప్పినప్పటికీ.. బీసీసీఐ ఇలాంటి నిర్ణయాలు తీసుకునేందుకు ముందుకొస్తే మోదీ సర్కార్‌ ఏం చేస్తోందని ధ్వజమెత్తారు. ఉగ్రదాడిలో తమ వాళ్లని కోల్పోయిన కుటుంబాలు బాధలో ఉంటే BCCI, ICCలు తమ డబ్బు గురించి ఆలోచించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వాళ్ల నైతికతను ప్రశ్నిస్తోందని అన్నారు. మ్యాచ్‌లో పాల్గొనే ఆటగాళ్లకు సంబంధించిన పోస్టర్‌ను ఆమె ఎక్స్‌లో షేర్ చేశారు. 

Also Read :  మందుబాబులకు షాక్‌..ఓఆర్‌ఆర్‌ లోపల ఆ దుఖాణాలు బంద్‌...కానీ

ఇదిలాఉండగా.. ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 26 మంది పర్యాటకులు మృతిచెందారు. ఈ క్రమంలోనే పాక్‌తో భారత్‌ సంబంధాలు తెంచుకుంది. సింధు జలాలా ఒప్పందాన్ని నిలిపివేసింది. భారత్‌-పాక్ సరిహద్దును మూసివేసింది. గగనతలంపై కూడా పాక్‌ విమానాలు రాకుండా ఆంక్షలు పెట్టింది. ఆసియా కప్‌లో కూడా భారత్‌ పాల్గొంటుందా ? లేదా ? అనేది క్లారిటీ లేదు. పాక్‌తో క్రికెట్‌తో పాటు ఇతర క్రీడల్లో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడకూడదని ఇప్పటికే భారత్ నిర్ణయించింది. మరోవైపు క్రికెట్‌లో భారత్‌, పాక్ మధ్య సిరీస్‌లు జరగడం లేదు. ఇరుదేశాలు ICC టోర్నీలోనే తలపడనున్నాయి. 

Also read: కేంద్రం గుడ్‌న్యూస్.. వాళ్లకు నెలకు రూ.50 వేల ఆర్థిక సాయం

ఇదిలాఉండగా వరల్డ్ ఛాంపియన్స్‌ ఆఫ్‌ లెజండ్స్ టోర్నీలో భాగంగా ఆదివారం భారత్‌, పాక్‌ మధ్య బర్మింగ్‌హామ్‌లో మ్యాచ్‌ జరగనుంది. మాజీ క్రికెటర్ యువరాజ్‌ సింగ్ నాయకత్వంలో భారత్ ఛాంపియన్స్ తలపడనుంది. ఇందులో  గుర్కీరత్ సింగ్, యూసఫ్‌ పఠాన్, స్టువర్ట్ బిన్నీ, ఇర్ఫాన్ పఠాన్‌,  శిఖర్ ధావన్, సురేశ్‌ రైనా, అంబటి రాయుడు, హర్భజన్‌ సింగ్, పీయూశ్‌ చావ్లా, వినయ్ కుమార్,రాబిన్ ఉతప్ప, సిద్ధార్థ్ కౌల్, వరుణ్‌ ఆరోన్, అభిమన్యు మిథున్ భారత జట్టులో ఉన్నారు. 

Also Read :  పాకిస్థాన్‌తో మ్యాచ్‌లెందుకు.. BCCIపై శివసేన ఎంపీ ఫైర్

pakistan | india | Jammu Kashmir

Advertisment
Advertisment
తాజా కథనాలు