Wife : మహానటి..  భర్తను చంపేయాలని చూసి అడ్డంగా దొరికిపోయింది!

భార్యభర్తల మధ్య గొడవలు ఉండటం కామన్..  కలిసి మాట్లాడుకోవాలి.. సర్దుకుపోవాలి.. అంతేకాని అల్లరి చేసుకోకూడదు.. అల్లరిపాలు కాకూడదు. జీవితాలు నాశనం చేసుకోకూడదు.

New Update
wife

భార్యభర్తల మధ్య గొడవలు ఉండటం కామన్..  కలిసి మాట్లాడుకోవాలి.. సర్దుకుపోవాలి.. అంతేకాని అల్లరి చేసుకోకూడదు.. అల్లరిపాలు కాకూడదు. జీవితాలు నాశనం చేసుకోకూడదు.. కాపురంలో కలహాలు వస్తున్నాయనే కోపంతో ఓ ఇల్లాలు ఏకంగా కట్టుకున్న భర్తను లేపేయడానికే స్కెచ్ వేసింది. అతడి అదృష్టం బాగుండి బతికిపోవడంతో ఇప్పుడా ఇల్లాలు కటకటాలు లెక్కిస్తుంది.  ఇంతకు ఏం జరిగిదంటే..., 

మైసూర్ జిల్లాలోని నంజన్‌గూడ్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. నంజన్‌గూడ్‌కు చెందిన రాజేంద్ర, అతని భార్య సంగీత కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తుంది. ఇద్దరి మధ్య కుటుంబ వివాదాలు నడుస్తున్నాయి. దీంతో  ఇద్దరి మధ్య సయోధ్య లేదు. దీంతో తన భర్తను హత్య(Wife Plan To Kill Husband) చేయాలని  ఆమె సోదరుడు సంజయ్, అతని స్నేహితులు విఘ్నేశ్, ఒక బాలుడు (17)తో కలిసి స్కెచ్ వేసింది సంగీత. 

Also Read :  కిడ్నాపర్‌ని కాల్చి చంపిన పోలీసులు.. 20 మంది చిన్నారులు సేఫ్

రాజేంద్రతో గొడవకు

ప్లాన్ లో భాగంగా అక్టోబర్ 25న రాజేంద్రను బయటకు వెళ్దామని సంగీత కోరింది. ఇద్దరూ కలిసి నంజన్‌గూడ్‌లోని హుండువినహళ్లి బ్లాక్ సమీపంలో బైక్‌పై వెళ్తున్నారు. ఆ సమయంలో వీరి ముందు వెళ్తున్న ఓ తెల్లటి పోలో కారు బైక్ ముందు ఆగింది. కారులో ఉన్న వ్యక్తి దగ్గరగా వచ్చి ముందుగా స్కూటర్‌ను ఢీకొట్టాడు. దీంతో రాజేంద్ర, సంగీత కింద పడిపోయారు. ఈ సమయంలో మరొక వ్యక్తి కారు దిగి రాజేంద్రతో గొడవకు దిగాడు. ఈ సమయంలో, కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు సంగీత వద్దకు వచ్చి ఆమె మెడలోని గొలుసు లాక్కోవడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో వారిలో ఒకరు రాజేంద్రను పదునైన ఆయుధంతో పొడిచారు. రాజేంద్ర కేకలు వేయడం, అదే సమయంలో అటు వైపు వాహనాలు వస్తుండడంతో వారిని వదిలి నిందితులు పరారయ్యారు. 

ఈ ఘటనలో రాజేంద్ర తీవ్రంగా గాయపడటంతో అతన్ని మైసూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న  నంజన్‌గూడ్ పోలీసులు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఇదంతా రాజేంద్రను హత్య చేయడానికి అతని భార్య సంగీత గీసిన స్కెచ్ అని తేలింది. విచారణలో సంగీత తన తప్పును అంగీకరించింది. బాలుడ్ని రిమాండ్‌ హోంకు పంపించి, మిగిలిన ముగ్గురినీ న్యాయ నిర్బంధానికి పంపించామని ఎస్పీ విష్ణువర్ధన్‌ తెలిపారు. 

Also Read :  దారుణం .. కారు సైడ్ మిర్రర్‌కు బైక్ తాకిందని.. 2 కి.మీ. వెంటాడి మరీ చంపేశారు!

Advertisment
తాజా కథనాలు