/rtv/media/media_files/2025/10/30/mumbai-studio-hostage-1-2025-10-30-18-05-10.jpg)
Mumbai Studio Hostage
ముంబై నుండి సంచలన వార్త బయటకొచ్చింది. ముంబై స్టూడియోలో పిల్లలను బందీలుగా ఉంచిన నిందితుడు రోహిత్ ఆర్య(Rohit Arya) ను పోలీసులు కాల్చి చంపారు. నివేదికల ప్రకారం.. పిల్లలను రక్షించే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరిపినట్లు సమాచారం. అనంతరం గాయాలతో ఉన్న రోహిత్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా.. అక్కడ అతను మరణించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ముంబైలోని పోవై ప్రాంతంలో జరిగిన సంచలన ఘటన ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. RA స్టూడియోస్‌లో రోహిత్ ఆర్య అనే వ్యక్తి సుమారు 15 నుంచి 20 మంది చిన్న పిల్లలను బంధీలుగా ఉంచడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
Also Read : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్లు ... ఆస్తులెంతో తెలుసా?
ఏం జరిగిందంటే?
పోవైలోని RA స్టూడియోస్‌లో గత కొద్ది రోజులుగా ఆడిషన్లు కొనసాగుతున్నాయి. ఇవాళ దాదాపు 100 మంది చిన్నారులు ఆడిషన్ కోసం స్టూడియోకి వెళ్లారు. అక్కడ స్టూడియోలో పనిచేస్తున్న రోహిత్ ఆర్య అనే వ్యక్తి ఆడిషన్ పూర్తయిన తర్వాత 20 మంది పిల్లలను బంధించి.. మిగతా 80 మంది చిన్నారులను విడిచిపెట్టాడు.
Mumbai Studio Hostage
#BREAKING | Children taken hostage in Mumbai's RA Studio building in Powai. Cops in talk with suspect.
— Harsh Trivedi (@harshtrivediii) October 30, 2025
More details awaited. pic.twitter.com/lIKxQr33ZU
Also Read : కారు సైడ్ మిర్రర్‌కు బైక్ తాకిందని.. 2 కి.మీ. వెంటాడి మరీ చంపేశారు!
అనంతరం కిడ్నాపర్ రోహిత్ ఆర్య ఒక వీడియోను విడుదల చేశారు. అందులో వీడియో ప్రారంభంలో తనను తాను పరిచయం చేసుకుంటూ.. నిందితుడు ఇలా అన్నాడు. ‘‘ఆత్మహత్యకు బదులుగా నేను ఒక ప్రణాళిక వేసుకుని కొంతమంది పిల్లలను బందీలుగా చేసుకున్నాను. నాకు పెద్దగా డిమాండ్లు లేవు. నాకు చాలా సరళమైన డిమాండ్లు, నైతిక డిమాండ్లు, చాలా ప్రశ్నలు ఉన్నాయి. నేను కొంతమందితో మాట్లాడాలనుకుంటున్నాను. వారిని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. వారి సమాధానాలకు వారికి ఏవైనా ప్రతి-ప్రశ్నలు ఉంటే, నేను వారిని ప్రతి-ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. కానీ నాకు ఈ సమాధానాలు కావాలి. నేను ఉగ్రవాదిని కాదు, డబ్బు డిమాండ్ చేయడం లేదు.
నాకు కొన్ని ప్రశ్నలు అడగాలని ఉండటం వల్ల కొంతమందిని బందీలుగా చేసుకున్నాను. ఒక పథకం ప్రకారం నేను ఈ పిల్లలను బందీలుగా తీసుకున్నాను. ఇది బాగా ఆలోచించి చేసిన పని. నేను బతికి ఉంటే.. నేను ఖచ్చితంగా చేస్తాను. నేను చనిపోతే మరొకరు చేస్తారు. కానీ అది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఏ చిన్న తప్పు చేసినా, నేను ఈ స్థలమంతా నిప్పంటించి చనిపోతాను. నేను చనిపోయినా, చనిపోకపోయినా, పిల్లలు ఎలాంటి కారణం లేకుండా గాయపడతారు.
దానికి నేను బాధ్యత వహించను. ఎలాంటి కారణం లేకుండా నన్ను రెచ్చగొట్టే వారు దానికి బాధ్యత వహిస్తారు. నేను ఒంటరిగా లేను. నాతో పాటు మరికొందరు ఉన్నారు. చాలా మందికి ఈ సమస్యలు ఉన్నాయి. నేను మాట్లాడటం ద్వారా ఒక పరిష్కారాన్ని అందించబోతున్నాను. దయచేసి నన్ను ఎవరినీ బాధపెట్టేలా ప్రేరేపించవద్దు.’’ అని ఆ వీడియోలో తెలిపాడు. ఈ వీడియో బయటకొచ్చిన అతి కొద్ది నిమిషాల్లోనే నిందితుడ్ని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.
 Follow Us
 Follow Us