Bengaluru : దారుణం .. కారు సైడ్ మిర్రర్‌కు బైక్ తాకిందని.. 2 కి.మీ. వెంటాడి మరీ చంపేశారు!

కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. కారు సైడ్ మిర్రర్‌కు బైక్ తాకిందని..2 కిలో మీటర్లు వెంటాడి మరీ ఫుడ్ డెలివరీ బాయ్ ను మరి చంపేసింది ఓ జంట.  పుట్టెనహళ్లి ప్రాంతంలో అక్టోబర్ 25 రాత్రి  ఈ ఘటన చోటుచేసుకుంది.

New Update
accident

కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. కారు సైడ్ మిర్రర్‌కు బైక్ తాకిందని..2 కిలో మీటర్లు వెంటాడి మరీ ఫుడ్ డెలివరీ బాయ్ ను మరి చంపేసింది ఓ జంట.  పుట్టెనహళ్లి ప్రాంతంలో అక్టోబర్ 25 రాత్రి  ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన  వివరాల ప్రకారం..  మనోజ్ కుమార్ , ఆర్తి శర్మ దంపతులు(couples) కారులో వెళ్తుండగా..అనుకోకుండా కారు సైడ్ మిర్రర్‌కు ఫుడ్ డెలివరీ బాయ్ దర్శన్  బైక్ తగిలింది(road accident). దర్శన్ వెంటనే వారికి క్షమాపణలు చెప్పి, డెలివరీ ఇవ్వడానికి వెళ్ళిపోయాడు.

అయినప్పటికీ  కోపంతో ఊగిపోయిన మనోజ్ కుమార్ తన కారును వెనక్కి తిప్పి, దర్శన్‌ను చేజ్ చేయడం ప్రారంభించాడు. రెండు కిలోమీటర్ల దూరం వెంబడించిన తర్వాత, మనోజ్ కుమార్ తన కారుతో దర్శన్ స్కూటర్‌ను ఉద్దేశపూర్వకంగా వెనుక నుంచి వేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో దర్శన్,  అతని స్నేహితుడు రోడ్డుపై పడిపోయారు.  ఈ ఘటనలో దర్శన్ అక్కడికక్కడే మరణించగా, అతని స్నేహితుడికి తీవ్ర గాయాలయ్యాయి. సీసీటీవీతో నిజం బయటపడింది. మొదట, దర్శన్ సోదరి హిట్ అండ్ రన్ కేసుగా జేపీ నగర్ ట్రాఫిక్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Also Read :  పడవ బోల్తా.. ఒకరు మృతి - ఎనిమిది మంది గల్లంతు

దంపతులు ముసుగులు ధరించి మళ్లీ

కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, అది ప్రమాదం కాదని, ఉద్దేశపూర్వకంగా జరిగిన హత్య అని తేలింది. కారు కావాలనే బైకును ఢీకొట్టి వెళ్లిపోయినట్లు ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది. ఈ ప్రమాదం జరిగిన కొద్దిసేపటి తర్వాత నిందితులైన దంపతులు ముసుగులు ధరించి మళ్లీ ఘటనా స్థలానికి వచ్చి, కారుకు తగిలిన విరిగిపోయిన భాగాలను తీసుకెళ్లడానికి ప్రయత్నించగా, వారు సీసీటీవీ కెమెరాలకు చిక్కారు. సౌత్ బెంగళూరు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ లోకేష్ జగలసార్ ఈ ఘటనను వెల్లడించారు. సీసీటీవీ ఆధారంగా ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారిపై హత్య,  సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన ఆరోపణల కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటన బెంగళూరులో సంచలనం సృష్టించింది. 

Also Read :  నవంబర్‌లో సెలవులే సెలవులు.. మొత్తం ఎన్నంటే..?

Advertisment
తాజా కథనాలు