/rtv/media/media_files/2025/04/27/3SMnpjBV3TRuUWaQDzjr.jpg)
Visakhapatnam Police arrest Pakistani loan app gang
Pahalgam Attack: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశమంతా హై అలర్ట్ నడుస్తోంది. తాజాగా విశాఖపట్నంలో లోన్ యాప్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ నుంచి ఆపరేట్ చేస్తున్నట్లు గుర్తించగా రూ.200 కోట్ల రూపాయల లావాదేవీలు నడుస్తున్నట్లు వెల్లడించారు. లోన్ యాప్‌ల ద్వారా పలు ముఠాలు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నాయని ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ కేసులో 9 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. లోన్ యాప్‌లో రూ.2 వేల రూపాయలు అప్పు తీసుకున్న నరేంద్ర అనే యువకుడిని ద్వారా ఈ కేసు చేధించినట్లు పేర్కొన్నారు.
— VizagCityPolice (@vizagcitypolice) April 27, 2025
Also Read : గిల్ నువ్ సుపరెహే.. సచిన్ కూతురుతో డేటింగ్‌పై షాకింగ్ రియాక్షన్.. 3 ఏళ్ళ నుంచి!
భార్య ఫొటోలు మార్ఫింగ్ చేసి..
'నరేంద్ర అనే యువకుడి భార్య ఫోటోలను సైబర్ నేరగాళ్లు మార్ఫింగ్ చేశారు. ఫ్రెండ్స్, బంధువులకు పంపించారు. అవమానం తట్టుకోలేక 40 రోజులకే నరేంద్ర సూసైడ్ చేసుకున్నాడు. ఈ దందా పాకిస్థాన్ కేంద్రంగా నడుస్తోంది. దాదాపు ఇండియానుంచి 9 వేల మంది మోసపోయారు. నిందితులనుంచి 18 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్, 54 సిమ్ కార్డులు, రూ.60 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు.
Also Read : జాగ్రత్తగా చూసుకున్నాడు...మా బంధానికి పేరు పెట్టలేను...సామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
మరోవైపు విశాఖతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పాక్ పౌరులను గుర్తించి తమ దేశానికి పంపిస్తున్నారు. ఆధార్ కార్డు, పోస్ పోర్ట్, తదితర వివరాల ఆధారంగా తనిఖీలు చేపడతున్నారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ లో పిల్లలతో సహా 1026 మంది పాకిస్తాన్ వాళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
Also Read : భద్రతా బలగాలకు మావోయిస్టు అగ్రనేత లేఖ
Also Read : వికారాబాద్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్!
loan app | vishakapatnam | today telugu news