/rtv/media/media_files/2025/04/27/zbwG4qd65PZJzlb0GRqY.jpg)
vikarabad road accident
ఈ మధ్య రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఎన్ని ట్రాఫిక్ ఆంక్షలు విధించిన, రోడ్ సేఫ్టీ నియమాలు అమలు చేసినా యాక్సిడెంట్స్ ఆగడం లేదు. తాజాగా వికారాబాద్ జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఐనన్‌పల్లి వద్ద రెండు కార్లు ఢీకొని ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటక నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఆలయానికి వెళ్లి.. వస్తుండగా
అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన ముగ్గురు వ్యక్తులు కర్ణాటక గనుగాపూర్ లోని దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్లారు. దర్శనం తర్వాత తిరిగి వస్తుండగా చిట్టపల్లి- యాలమద్ది గ్రామాల నేషనల్ హై వే పై బొలేరో వాహనం ఢీకొట్టింది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
telugu-news | vikarabad-district
Also Read : నన్ను ఎవరూ ఆనందపరచలేదు.. బ్రేకప్ లిస్ట్ పై శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్!