/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/missing-children-jpg.webp)
missing children
ఏపీలోని విశాఖపట్నంలో ముగ్గురు చిన్నారులు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ముచ్చమాంబ కాలనీకి చెందిన ముగ్గురు చిన్నారులు అదృశ్యం అయ్యారు. జనవరి 31వ తేదీన ఆడుకోవడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ముగ్గురు పిల్లలు ఆదిత్య సాహు (9), లక్ష్మీ సాహు (7), గొర్లి గంగోత్రి (9) తిరిగి రాలేదు. తల్లి గౌరీ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒడిస్సా బోర్డర్‌లో పోలీసులు చిన్నారులను గుర్తించారు. అయితే వీరు స్వతహాగానే వెళ్లారా? లేకపోతే ఎవరైనా వీరిని తీసుకెళ్లారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: CM Chandrababu: ఇలాంటి బావమరిది దొరకడం నా అదృష్టం.. చంద్రబాబు ఎమోషనల్!
వరుసగా నాలుగు విల్లాల్లో..
ఇటీవల తిరుపతిలో శనివారం అర్థరాత్రి భారో చోరీ జరిగింది. కొందరు దొంగలు ఏకంగా ఇళ్లను బద్దలు కొట్టి బంగారం కొట్టేశారు. 1.048 కిలోల బంగారాన్ని దోచుకున్నారు. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వరసగా ఉన్న నాలుగు ఇళ్లపై కేటుగాళ్లు దాడి చేసి డబ్బులు తీసుకెళ్లారు. అర్ధరాత్రి సమయంలో ఓ విల్లా సోలార్ ఫెన్సింగ్ కట్ చేసి లోపలికి ప్రవేశించారు. వరసగా 80, 81, 82, 83 విల్లాల్లో చోరీకి ప్రయత్నించారు.
ఇది కూడా చూడండి: Jayalalitha: జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికే...సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పు!
బాధితులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అంత సెక్యూరిటీ ఉన్న ఇంట్లోనే దొంగలు దోచుకున్నారంటే.. సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నారు.
ఇది కూడా చూడండి: AP Crime: కొడుకును నెత్తురు కక్కేలా కొట్టిన తండ్రి.. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే!
ఇది కూడా చూడండి: RC16: 20 ఏళ్ళు వెనక్కి వెళ్లి.. RC16 షూటింగ్ కోసం బుచ్చిబాబు పెద్ద ప్లానింగ్!