Monica Song: 'మోనికా' పాటలో పూజతో స్టెప్పులేసిన ఈ నటుడు ఎవరు? సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్

'మోనికా' స్పెషల్ సాంగ్ లో పూజతో పాటు  ఎనర్జిటిక్ స్టెప్పులతో అందరి దృష్టిని ఆకర్షించాడు మలయాళ నటుడు సౌబిన్ షాహిర్! అతడి ఫ్లోలెస్ డాన్స్ మూవ్స్ నెటిజన్లను ఆశ్చర్యపరిచాయి.

New Update

Monica Song: రజినీకాంత్ 'కూలీ' నుంచి ఇటీవలే విడుదలైన 'మోనికా' స్పెషల్ సాంగ్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది. ఎక్కడ చూసిన ఈ పాటకు సంబంధించిన డాన్స్ వీడియోలు, రీల్స్  వైరల్ అవుతున్నాయి. ఇందులో స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే గ్లామరస్ పర్ఫామెన్స్ తో ఫిదా చేసింది. అయితే ఈ పాటలో పూజతో పాటు  ఎనర్జిటిక్ స్టెప్పులతో అందరి దృష్టిని ఆకర్షించాడు మలయాళ నటుడు సౌబిన్ షాహిర్! అతడి ఫ్లోలెస్ డాన్స్ మూవ్స్ నెటిజన్లను ఆశ్చర్యపరిచాయి. దీంతో ఆడియన్స్ ఆయన సినీ నేపథ్యం, కెరీర్ కి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి ఇంటర్నెట్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు. సౌబిన్ ఎవరు? అతడి సినిమాలేంటి అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.. 

'సుదాని ఫ్రమ్ నైజీరియా' తో గుర్తింపు 

సౌబిన్ షాహిర్ తెరవెనుక నుంచి తన సినీ కెరీర్ ను మొదలు పెట్టాడు. పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్, ప్రొడక్షన్ కంట్రోలర్ గా వర్క్ చేశాడు. అలా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సమయంలోనే చిన్న చిన్న పాత్రల్లో నటించడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత  2018లో సౌబిన్  'సుదాని ఫ్రమ్ నైజీరియా' సినిమాలో ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమా  అతని కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది.  ఇందులో సౌబిన్ నటనకు ఉత్తమ నటుడిగా  'కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం' లభించింది. 

మంజుమ్మెల్ బాయ్స్ తో భారీ విజయం 

2024లో సౌబిన్ నటించి, నిర్మించిన 'మంజుమ్మెల్ బాయ్స్' సినిమా భారీ అద్భుత విజయాన్ని సాధించింది. మలయాళంలో మాత్రమే కాకుండా ఇతర భాషల్లోనూ ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా సాధించి మలయాళ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో సౌబిన్ క్రేజ్ మరింత పెరిగింది. 

ఇప్పుడు రజినీకాంత్ 'కూలీ' తో మరోసారి సౌబిన్ పేరు మారుమోగింది. 'మోనికా' పాటలో ' సినిమాలో పూజా హెగ్డేతో కలిసి ఎనర్జిటిక్ స్టెప్పులేసి డ్యాన్స్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ పాటతో మలయాళంలోనే కాకుండా, ఇతర భాషల్లోనూ సౌబిన్ క్రేజ్ పెరగనుంది. అనిరుధ్ రవిచందర్ ఈ పాటకు సంగీతం అందించారు.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన 'కూలీ' ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్ వంటి స్టార్ కాస్ట్ కీలక పాత్రలో పోషించారు. 

Also Read: Kota Srinivas Rao: కోట మృతిపై కన్నీళ్లు పెట్టిస్తున్న చిరు, బాలయ్య, ఎన్టీఆర్ ట్వీట్స్ !

Advertisment
Advertisment
తాజా కథనాలు