Mohan Babu: మంచు ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్.. కలెక్టర్ కు మోహన్ బాబు ఫిర్యాదు

మంచు ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తన ఆస్తుల్లో ఉన్న వారిని ఖాళీ చేయించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. జలపల్లి లోని తన ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారని, వాళ్లను ఖాళీ చేయించి తనకు అప్పగించాలని కోరారు.

New Update
mohan babu

mohan babu

మంచు కుటుంబంలో గత కొన్ని రోజులుగా ఆస్తుల విషయంలో గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల సంక్రాంతి టైం లో కూడా ఈ కుటుంబం మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఈ ఘటన నేపథ్యంలో ఇద్దరిపై కేసులు నమోదయ్యాయి.  ఇక నిన్న మంచు బ్రదర్స్  మధ్య ట్విట్టర్ లో మాటల యుద్ధం సాగింది. దాన్ని బట్టి ఇవి ఆస్తి గొడవలే అని నిర్దారణ అయింది. 

అయితే ఈ వివాదంలో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తన ఆస్తుల్లో ఉన్న వారిని ఖాళీ చేయించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. జలపల్లి లోని తన ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారని, వాళ్లను ఖాళీ చేయించి వాటిని తనకు అప్పగించాలని కోరారు. కొన్ని రోజులుగా మోహన్ బాబు తిరుపతిలో ఉంటున్నాడు. జలపల్లి లో ఉన్న  నివాసంలో  మంచు మనోజ్ ఉంటున్నట్లు సమాచారం.

Advertisment
తాజా కథనాలు