Urvashi Rautela: సైఫ్ అలీ ఖాన్ కు క్షమాపణ చెప్పిన ఊర్వశీ రౌతేలా.. సిగ్గుగా ఉందంటూ పోస్ట్

బాలీవుడ్‌ హీరో సైఫ్ అలీ ఖాన్‌ కు.. ఊర్వశి రౌతేలా క్షమాపణలు చెప్పారు. సైఫ్‌పై జరిగిన దాడిని సినీ ప్రముఖులందరూ తీవ్రంగా ఖండించగా.. ఊర్వశి ఓ ఇంటర్వ్యూలో సైఫ్ గురించి చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..

New Update
urvashi rautela

urvashi rautela saif ali khan

బాలీవుడ్‌ నటుడు సైఫ్ అలీ ఖాన్‌ కు.. ఊర్వశి రౌతేలా క్షమాపణలు చెప్పారు. సైఫ్‌పై జరిగిన దాడిని సినీ ప్రముఖులందరూ తీవ్రంగా ఖండించగా, తన తాజా సినిమా డాకు మహారాజ్ సక్సెస్‌లో ఉన్న ఊర్వశి ఓ ఇంటర్వ్యూలో సైఫ్ గురించి వ్యాఖ్యానించారు. నేను నటించిన డాకు మహారాజ్ రూ.105 కోట్ల వసూళ్లతో మంచి విజయం సాధించింది. మా అమ్మ నాకు డైమండ్ ఉంగరం బహుమతిగా ఇచ్చారు. 

అలాగే నా తండ్రి ఖరీదైన రోలెక్స్ వాచ్‌ను కానుకగా ఇచ్చారు. అయితే, ప్రస్తుతం వాటిని ధరించి బయటకు వెళ్లడం భయంగా ఉంది. ఎందుకంటే ఎవరైనా ఎవరైనా మనపై అలా దాడి (సైఫ్‌) చేస్తారనే భయం ఉండటంతో జాగ్రత్తగా ఉండాల్సి వస్తోంది’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల ఊర్వశి సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఆమె సైఫ్ కు క్షమాపణ చెప్తూ నోట్‌ విడుదల చేశారు." సైఫ్ అలీ ఖాన్ సర్‌కి నా క్షమాపణలు. ఈ పోస్ట్‌ మీ వరకు చేరుతుందని ఆశిస్తున్నాను. ఒక ఇంటర్వ్యూలో మీ గురించి మాట్లాడేటప్పుడు నేను అనుచితంగా వ్యవహరించాను. ఆ సమయంలో మీరు ఎదుర్కొంటున్న సమస్య తీవ్రత గురించి నాకు అవగాహన లేదు. 

డాకు మహారాజ్ విజయం కారణంగా ఆనందంలో ఉన్న నేను, ఆ సక్సెస్‌ వల్ల వచ్చిన బహుమతుల గురించి మాట్లాడటం అభాసుపాలైంది. మీపై జరిగిన దాడి తీవ్రత గురించి తెలుసుకున్న తర్వాత సిగ్గు పడుతున్నాను. నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. కష్ట సమయంలో మీరు చూపిన తెగువ, ధైర్యం చాలా గొప్పది. మీపై గౌరవంతో...’’ అంటూ పేర్కొన్నారు.

Also Read: గేమ్ ఛేంజర్ పై కుట్ర చేసింది వీళ్లే.. ఆరుగురి అరెస్ట్!

Advertisment