/rtv/media/media_files/2025/10/26/cab-drivers-2025-10-26-22-54-25.jpg)
బెంగళూరులో క్యాబ్ డ్రైవర్లు సూపర్ ఇంగ్లీషులో మాట్లాడుతున్నారా...అయితే వారు పక్కా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు అయి ఉంటారు. ప్రస్తుతం అక్కడ చాలా మంది టెకీలు ఇదే పని చేస్తున్నారు. దానికి కారణం డబ్బులు సరిపోకపోవడం కాదట. ఒంటరితనమని చెబుతున్నారు. ఆఫీసు అవర్స్ తరువాత చాలా మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు...క్యాబ్ డ్రైవర్లుగా పని చేస్తున్నారు. ఆఫీసు అయ్యాక ఆ స్ట్రెస్ నుంచి బయట పడడానికి వేరే ఉద్యోగం చేస్తున్నారు. ఇంటికి దూరంగా ఉండడం, ఆము పని చేసే చోట తోడు లేకపోవడం, ఆఫీసుల్లో స్ట్రెస్ ఇలాంటి కారణాలతో ఉండలేకపోతున్నామని టెకీలు చెబుతున్నారు.
ఒంటరితనం భరించలేక..
సాధారణంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ఎప్పుడూ ఒకేపని ఉంటుంది. ఒకేలాంటి జీవితంతో చాలా విసిగిపోతుంటారు. దాని నుంచి తప్పించుకోవడానికి రకరకాల పనులు చేస్తుంటారు. ఇందులో భాగంగానే ఇప్పుడు క్యాబ్ డ్రైవర్లుగా కూడా పని చేస్తున్నారు. డ్రైవింగ్ వలన స్ట్రేస్ తగ్గుతుందని..ఒ్తినే ఎక్కువ దూరాలు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం కన్నా..ఇలా చేస్తే మనుషులతో ఉన్నట్టు అవుతుంది, డబ్బులు కూడా వస్తాయని చెబుతున్నారు. ఇలా క్యాబ్ డ్రైవర్లు గా పని చేసే టెకీలు ఎక్కువగా ఎయిర్ పోర్ట్, బెంగళూరు శివార్లు ఇలాంటి ప్రదేశాలకు రెయిడ్‌లను ఒప్పుకుంటున్నారు. అవి అయితే ఎక్కువ దూరం ఉంటాయని అంటున్నారు. అలానే రోజూ కూడా ఈ పని చేయడం లేదు. వారంలో రెండు, మూడు రోజులు మాత్రమే ఇలాంటి పనులు చేస్తూ రిలాక్స్ అవుతున్నారు. ఖాళీగా ఉండే కన్నా ఇలా తమను తాము బిజీగా ఉండండం ఆనందాన్నిస్తుందని చెబుతున్నారు.
Follow Us