Russia: రష్యా అమ్ములపొదిలోకి సరికొత్త క్షిపణి.. అమెరికాకు సవాల్

అమెరికాకు రష్యా మరో షాకిచ్చింది. తమ అమ్ములపొదిలోకి సరికొత్త ఆయుధాన్ని తీసుకురానుంది. బూరెవెస్ట్‌నిక్ అనే మిసైల్‌ను విజయవంతంగా పరీక్షించామని రష్యా అధినేత పుతిన్ ప్రకటించారు.

New Update
Vladimir Putin announces successful test of unique cruise missile with nuclear engine

Vladimir Putin announces successful test of unique cruise missile with nuclear engine

అమెరికాకు రష్యా మరో షాకిచ్చింది. తమ అమ్ములపొదిలోకి సరికొత్త ఆయుధాన్ని తీసుకురానుంది. బూరెవెస్ట్‌నిక్ అనే మిసైల్‌ను విజయవంతంగా పరీక్షించామని రష్యా అధినేత పుతిన్ ప్రకటించారు. ఇది అణుశక్తితో నడుస్తుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే బూరెవెస్ట్‌నిక్ క్షిపణి మోహరింపునకు మౌలిక సదుపాయాలు సిద్ధం చేయాలని సాయుధ దళాలకు ఆదేశాలు జారీ చేశారు.  ఇక వివరాల్లోకి వెళ్తే ఇటీవల రష్యా ఆర్మీ అణు విన్యాసాలు నిర్వహించింది. 

Also Read: మెట్రో స్టేషన్‌లో కండోమ్‌ ప్యాకెట్లు.. షాకైపోయిన ప్రయాణికులు

Successful Test Of Unique Cruise Missile With Nuclear Engine

వీటిని స్వయంగా పుతిన్ పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలోనే రష్యా చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌, ఇతర సైనిక కమాండర్లతో ఆయన ఓ మీటింగ్ నిర్వహించారు. అయితే పరీక్షలు చేసిన సమయంలో ఆ క్షిపణి 15 గంటల పాటు గాల్లోనే ఉందని కమాండర్లు చెప్పారు. ఏకంగా 14 వేల కిలోమీటర్లు ప్రయాణించినట్లు పేర్కొన్నారు. 

Also Read: మొదటి సారిగా ఢిల్లీ రాష్ట్రానికి అధికారిక చిహ్నం.. ఆవిష్కరణ తేది ఫిక్స్

దీనికన్నా ముందు పుతిన్ సైనిక ఉన్నతాధికారులతో కూడా సమావేశమయ్యారు. రష్యా  బలగాల చీఫ్‌ ఆఫ్‌ జనరల్‌ స్టాఫ్‌ జనరల్ వాలెరీ గెరాసిమోవ్ నేతృత్వంలో కమాండర్లతో ఆయన మాట్లాడారు. 10 వేల మందికి పైగా ఉక్రెయిన్ సైనికులను ఈ క్షిపణి చుట్టుముట్టినట్లు గెరాసిమోవ్ చెప్పారు. 31 బెటాలియన్లతో కూడిన ఉక్రెయిన్ సాయుధ దళాల టీమ్‌ను అడ్డుకున్నామని వెల్లడించారు.  

Also Read: భారత్ సహా నాలుగు దేశాలను కుదిపేసిన భారీ భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు

Advertisment
తాజా కథనాలు