/rtv/media/media_files/2025/02/15/fNo7zzxPZltuiqICRPY0.webp)
Tirupathi
దళిత యువకుడిని ప్రేమించినందుకు కన్న కూతురినే తల్లి చంపేసిన దారుణ ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని ఓ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక సమీపంలోని ఓ గిరిజన యువకుడిని ప్రేమించింది. అయితే కూతురు గర్భం దాల్చడంతో తల్లి అబార్షన్ చేయించి.. యువకుడికి కాస్త దూరంగా ఉంచింది. ఈ క్రమంలో ఆ యువకుడిపై పోక్సో యాక్ట్ కింద కేసు పెట్టి జైలుకి పెట్టించింది.
ఇది కూడా చూడండి: Brain Health: ఈ అలవాట్లు వెంటనే మానెయ్ లేదంటే బ్రెయిన్ షెడ్డుకే..!
తల్లే బాలికను చంపి ఆ తర్వాత.. తెలియనట్లు..
మళ్లీ ఆ యువకుడు బయటకు వచ్చిన తర్వాత ఇద్దరూ మళ్లీ కలిసి తిరిగారు. ఈ విషయం తెలుసుకున్న తల్లి బాలికకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించింది. కానీ బాలిక మాట వినకుండా తనకి నచ్చినట్లుగా ఉంది. మళ్లీ బాలిక ఆ యువకుడిని కలవడానికి వెళ్తుంటే.. తల్లి ఆపింది. ఈ క్రమంలో బాలిక ఎదురు తిరగడంతో తల్లి కొట్టింది. దీంతో ఆ బాలిక అకస్మాత్తుగా కింద పడి మృతి చెందింది. అయితే బాలిక మృతి చెందడంతో తల్లి ఇంటికి తాళం వేసుకుని పనికి వెళ్లింది.
ఇది కూడా చూడండి: Hyderabad Mandi Biryani: హైదరాబాద్ వాసులకు 'ఫ్రీ మండి' బిర్యానీ.. ఎలాంటి షరతులూ లేవు..
ఆ తర్వాత భర్తకు ఫోన్ చేసి.. పాఠశాలకు వెళ్లేందుకు లేపమని పంపించేసరికి కుమార్తె చనిపోయి ఉంది. అయితే బంధువులు అందరూ కలిసి బాలిక మృతదేహాన్ని గ్రామ సమీపంలోకి తీసుకెళ్లి దహనం చేశారు. అయిత ఈ విషయంపై పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే దర్యాప్తు చేపట్టగా.. ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఇది కూడా చూడండి: China: మీరు పెంచితే మేము పెంచమా అంటున్న చైనా..125 శాతం సుంకం పెంపు
ఇది కూడా చూడండి: TG Crime: సిరిసిల్లలో ఘోరం.. తొగొచ్చి తండ్రిని కొట్టి చంపిన కొడుకు!