/rtv/media/media_files/2025/02/19/nSIg7gqU4HW8lC1xHiE5.webp)
Karimnagar Siricilla Son kills father
TG Crime: తెలంగాణలో మరో దారుణం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేటలో-- తండ్రి కనకయ్యను కొట్టి చంపేశాడు కొడుకు పరశురాములు. మద్యానికి బానిసైన కొడుకును -- తాగొద్దని మందలించడంతో కోపంలో కర్రతో మెడపై దాడి చేశాడు. కనకయ్య అక్కడికక్కడే చనిపోగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.
తండ్రీకొడుకులు ఆత్మహత్య..
ఇదిలా ఉంటే..ఆర్థిక ఇబ్బందులతో తండ్రీకొడుకులు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన కృష్ణాజిల్లా పెనమలూరులో వెలుగుచూసింది. అయితే సాయి ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఏదో వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కాగా, కరోనా తర్వాత ఆయన వ్యాపారం తీవ్రంగా నష్టపోయింది. పలు చోట్ల అప్పులు చేయవల్సి వచ్చింది. దీంతో ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోయాయి.
Also Read: బాల్కనీలో పావురాలతో ఇబ్బంది పడుతున్నారా?. ఇలా చేయండి
అప్పుల నుంచి బయటపడలేకపోయిన సాయి ప్రకాష్ ఎంతో విషాదకరంగా తనువు చాలించాడు. సైనైడ్ కలిపిన ఐస్ క్రీమ్ తిని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తనతో పాటు కొడుకుకు కూడా అది తినిపించాడు. చనిపోయేముందు కుటుంబ సభ్యులకు సారీ అంటూ మెసేజ్ పంపాడు. భర్త, కొడుకు మరణంతో భార్య లక్ష్మీదేవి, ఇతర కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు.
Also Read: హనుమాన్ జయంతి నాడు ఇలా చేయండి.. మీ శని, దరిద్రం పరార్!
siricilla | father | son | murder | today telugu news