Brain Health: ఈ అలవాట్లు వెంటనే మానెయ్ లేదంటే బ్రెయిన్ షెడ్డుకే..!

మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు సరైన ఆహారం, విశ్రాంతి, శారీరక శ్రమ ముఖ్యమని తెలుసుకోండి. హెడ్ ఫోన్స్ ఎక్కువ వినడం, ప్రాసెస్ చేసిన ఆహారం, ఒత్తిడి, బ్రేక్‌ఫాస్ట్ మానడం, డీహైడ్రేషన్ వంటి పొరపాట్లు మెదడుకు చాలా హానికరం.

New Update
Brain Health

Brain Health

Brain Health: మన మానవ శరీరంలో అత్యంత కీలకమైన అవయవం మెదడు. ఇది మన జీవితం మొత్తాన్ని నియంత్రిస్తుంది. మనం చేసే పనులన్ని, మన శరీరంలోని అన్ని అవయవాలు మెదడు నుండి వచ్చే సంకేతాల ఆధారంగా పని చేస్తాయి. అందువల్ల, మెదడు ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉండటం చాలా అవసరం. కానీ మనం తెలియకుండానే, కొన్ని ఆరోగ్య సంబంధిత పొరపాట్లు మెదడుకు నష్టం చేకూరుస్తాయి. ఈ పొరపాట్లను గుర్తించి, వాటిని నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read: బాల్కనీలో పావురాలతో ఇబ్బంది పడుతున్నారా?. ఇలా చేయండి

శబ్దం: హెడ్ ఫోన్స్

తరచూ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మ్యూజిక్ వినడం, అధిక శబ్దాల ఉత్పత్తి చేయడం మెదడు ఆరోగ్యానికి హానికరంగా ఉంటుంది. కొంత కాలానికి ఈ అలవాట్లు మీ వినికిడి సామర్థ్యాన్ని క్రమంగా తగ్గించే ప్రమాదం ఉంటుంది. తద్వారా, భవిష్యత్తులో మీ మెదడు మరింత ఒత్తిడికి గురవుతుంది. కనుక, కొంత సమయం తర్వాత హెడ్ ఫోన్స్ తప్పనిసరిగా తీసేయాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు

ప్రాసెస్ చేసిన ఫుడ్ లేదా జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల, మీ మెదడు పనితీరు లోపం కలిగించవచ్చు. ఇది అల్జీమర్స్ వంటి మెదడు సంబంధిత వ్యాధులపై ప్రభావం చూపే అవకాశాన్ని పెంచుతుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం, ముఖ్యంగా మెదడుకు అవసరమైన పౌష్టిక పదార్థాలు, మెదడును క్రమంగా శక్తివంతంగా ఉంచడానికి సహాయపడతాయి.

Also Read: హనుమాన్ జయంతి నాడు ఇలా చేయండి.. మీ శని, దరిద్రం పరార్!

ఒత్తిడిని అధిగమించడం

ఆఫీసుల్లో గంటల తరబడి కూర్చుని పని చేయడం వల్ల, మెదడుకు సరైన రక్తప్రసరణ అందుకోవడం కష్టమవుతుంది. దీని వల్ల, మెదడులో పనిచేసే సామర్థ్యం తగ్గిపోతుంది. అందుకే, మధ్యలో కొంత సమయం నడవడం, పక్కకు వెళ్లడం, బ్రేక్ తీసుకోవడం మెదడుకు మంచి ఊతాన్ని ఇస్తుంది.

బ్రేక్‌ఫాస్ట్ మానడం

ఉదయం బ్రేక్‌ఫాస్ట్  ఒక మంచి అలవాటు. అయితే, ఈ రోజుల్లో చాలా మంది పనిలో ఒత్తిడిలో పడి ఉదయాన్నే టిఫిన్ చేయడం మానేస్తారు. కానీ, ఉదయం నిద్ర లేచి, పోషకాలు సమృద్ధిగా కలిగిన ఆహారం తీసుకోవడం మెదడుకు కావలసిన ఇంధనాన్ని అందిస్తుంది.

Also Read: షుగర్‌ ఉన్నవారికి అరటి పువ్వుతో కలిగే ప్రయోజనాలు

డీహైడ్రేషన్

వేసవిలో నీటి లోపం (డీహైడ్రేషన్) కూడా మెదడు పనితీరును ప్రభావితం చేస్తుంది. హఠాత్తుగా ఎక్కువ వేడి ఉన్నప్పుడు, శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. ఇది మెదడు పనితీరు తగ్గడం, ఫోకస్ తగ్గించే ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే వేసవిలో నీరును త్రాగడం మరింత ముఖ్యం.

మన మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే, సరైన ఆహారం,  విశ్రాంతి, శారీరక శ్రమ ముఖ్యం. సరైన ఆహారం, శారీరక శ్రమ మెదడును శక్తివంతంగా ఉంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.

Also Read: 25 ఏళ్ల వయసులో చేయించుకోవాల్సిన పరీక్షలు ఇవే

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు