TG Crime : గురుకుల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

గురుకుల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీపావళి పండుగ సెలవులకు ఇంటికి వెళ్లి, ఈరోజు ఉదయం తిరిగి పాఠశాలకు వచ్చిన శ్రీ వర్షిత ఆత్మహత్యకు పాల్పడింది.

New Update
gurkula

గురుకుల పాఠశాల(gurukul school)లో పదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీపావళి పండుగ సెలవులకు ఇంటికి వెళ్లి, ఈరోజు ఉదయం తిరిగి పాఠశాలకు వచ్చిన శ్రీ వర్షిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ రోజు ఉదయం  శ్రీ వర్షిత ఉపాధ్యాయురాలి సెల్ నుండి తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి, హాస్టల్‌లో ఉండలేకపోతున్నాను అని చెప్పినట్లు సమాచారం. దీంతో తల్లిదండ్రులు తీసుకెళ్లేందుకు పాఠశాలకు వస్తున్నామని బదులిచ్చారు.

వారు స్కూల్ కు వచ్చే లోపే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.అయితే విద్యార్థిని ఆత్మహత్యకు  గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనతో రాంపూర్ గ్రామంలో గురుకుల పాఠశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంతో తోటి విద్యార్థినిలు బోరున విలపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  కాగా సంఘటన స్థలాన్ని ఎల్కతుర్తి సీఐ పులి రమేష్, ఎస్ఐలు దివ్య, ప్రవీణ్ కుమార్ చేరుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read :  బస్సు ఎక్కే ముందు ఇవి చూసుకోండి.. లేదంటే నేరుగా యమలోకానికే!

Also Read :  అయ్యా.. నా ఒక్కగానొక్క కొడుకు ఇక లేడు.. రమేష్ తండ్రి మాటలు వింటే కన్నీళ్లు ఆగవు!

కీచక ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు

ఇక పదవ తరగతి విద్యార్థినిపై అసభ్య ప్రవర్తించిన  కీచక ఉపాధ్యాయుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్ కోట్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు రాఘవేందర్ రెడ్డి అనే ఉపాధ్యాయుడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు, ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. 

మరో ఘటనలో హనుమకొండలోని తేజస్వి స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న సుజిత్ ప్రేమ్ అనే విద్యార్థికి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో స్కూల్లోనే కుప్పకూలి మరణించాడు. నెలరోజులు గడవకముందే విద్యార్థుల వరుస మరణాలు తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈ ఘటనతో ఆగ్రహించిన విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్ ఎదుట ఆందోళన చేపట్టారు.

Advertisment
తాజా కథనాలు