బస్సు ఎక్కే ముందు ఇవి చూసుకోండి.. లేదంటే నేరుగా యమలోకానికే!

బస్సు ఎక్కగానే చాలామంది విండో సూటు కోసం చేసుకుంటారు. కానీ మీరు బస్సు ఎక్కగానే వేటిని గమలించాలో తెలుసా.. నిజానికి ప్రమాద సమయంలో అవే మీ ప్రాణాలు కాపాడుతాయి. ఏదైనా అనుకోని సంఘటన చోటుచేసుకుంటే వాటి నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

New Update
emergency window

బస్సు ప్రయాణాలు సురక్షితంగా ఉండాలంటే ప్రయాణికులు తప్పనిసరిగా కొన్ని అగ్ని ప్రమాద నివారణ జాగ్రత్తలు పాటించాలి. ఇటీవల జరిగిన బస్సు అగ్నిప్రమాదాల నేపథ్యంలో ఈ జాగ్రత్తలు మరింత కీలకం. బస్సు ఎక్కగానే చాలామంది విండో సూటు కోసం చేసుకుంటారు. కానీ మీరు బస్సు ఎక్కగానే వేటిని గమలించాలో తెలుసా.. నిజానికి ప్రమాద సమయంలో అవే మీ ప్రాణాలు కాపాడుతాయి. ఏదైనా అనుకోని సంఘటన చోటుచేసుకుంటే వాటి నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

  • ఎమర్జెన్సీ ఎగ్జిట్స్: బస్సులో ఎమర్జెన్సీ డోర్లు, కిటికీలు ఎక్కడ ఉన్నాయో గుర్తించండి. అగ్నిప్రమాదం జరిగితే వీటిని ఉపయోగించి బయటపడవచ్చు. ఈ ద్వారాలను ఎలా తెరవాలో తెలుసుకోండి. చాలా కిటికీలపై గాజును పగులగొట్టే సుత్తి అందుబాటులో ఉంటుంది.

  • ఫైర్ ఎక్స్‌టింగ్యూషర్: బస్సులో అగ్నిమాపక సిలిండర్ ఎక్కడ ఉందో, దాన్ని అత్యవసర పరిస్థితుల్లో ఎలా ఉపయోగించాలో గమనించండి.

ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • మండే వస్తువులు వద్దు: బస్సులో పెట్రోల్, డీజిల్, కిరోసిన్ వంటి మండే స్వభావం ఉన్న ద్రవాలను లేదా ప్రమాదకర వస్తువులను వెంట తీసుకెళ్లకూడదు.

  • పొగతాగడం నిషేధం: బస్సు లోపల లేదా బస్సు ఆగినప్పుడు దాని చుట్టుపక్కల పొగతాగడం (Smoking) ఖచ్చితంగా నివారించాలి. ఇది మంటలు వ్యాపించడానికి కారణం కావచ్చు.

  • ఛార్జింగ్ జాగ్రత్త: సెల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అధిక వేడి లేదా షార్ట్ సర్క్యూట్‌కు దారితీసే విధంగా వాటిని ఉంచవద్దు. ఛార్జింగ్ పూర్తవగానే ప్లగ్‌ను తీసివేయండి.

ప్రమాదం సంభవించినప్పుడు పాటించాల్సినవి:

  • అలారం/సమాచారం: బస్సులో ఎక్కడైనా పొగ లేదా మంటలు కనిపిస్తే వెంటనే డ్రైవర్‌కు/సిబ్బందికి తెలియజేయండి.

  • శాంతంగా ఉండండి: ప్రమాద సమయంలో భయపడకుండా, పరుగు తీయకుండా ప్రశాంతంగా ఉండాలి. తొక్కిసలాట జరిగితే మరిన్ని ప్రమాదాలు సంభవించవచ్చు.

  • బయటకు తరలడం: వీలైనంత త్వరగా ఎమర్జెన్సీ మార్గాల ద్వారా సురక్షితంగా బయటకు వెళ్లండి. బయటకు వెళ్ళడానికి ప్రధాన ద్వారం మూసుకుపోతే, ఎమర్జెన్సీ కిటికీలను ఉపయోగించండి.

  • బస్సు నుండి దూరం: బస్సు నుండి బయటపడిన వెంటనే వీలైనంత దూరం వెళ్లిపోండి.

ప్రయాణికులంతా ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా అగ్ని ప్రమాదాల నుండి తమను తాము, తోటి ప్రయాణికులను రక్షించుకోవచ్చు.

Advertisment
తాజా కథనాలు