/rtv/media/media_files/2025/04/13/X9m6ezRFc6iX3RGHbk2m.jpg)
Accident
తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరగ్గా ఐదుగురు దుర్మరణం చెందారు. నంద్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. తెలంగాణలోని ములుగు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఈ ప్రమాదాల్లో మొత్తం 18 మందికి గాయాలయ్యాయి.
ఇది కూడా చూడండి: KL Rahul: టీ20ల్లో కోహ్లీ రికార్డు బ్రేక్.. చరిత్ర సృష్టించిన KL రాహుల్.. జీటీపై భారీ సెంచరీ!
ముగ్గురు మృతి చెందగా..
ఏపీలో నంద్యాల జిల్లాలో కారు బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. కర్ణాటకలోని తుమకూరుకు చెందిన సంతోష్(47), లోకేశ్ (37), నవీన్ (37)గా పోలీసులు గుర్తించారు. శ్రీశైలం, మహానంది ఆలయాలు దర్శించుకుని డోన్ మీదుగా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: West Indies: వెస్టిండీస్‌కు కొత్త కెప్టెన్.. 2 ఏళ్ల విరామం తర్వాత సారథిగా జట్టులోకి!
ఇక పోతే తెలంగాణలో ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఇంకా 15 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. చెట్టుపెల్లి శ్వేత (40), నూగ దుర్గ (38) మృతులుగా గుర్తించారు. మేడారం వెళ్లి ట్రాక్టర్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Indian Army : సైన్యానికి కీలక అధికారులు..కేంద్రం నిర్ణయం
ఇదిలా ఉండగా విజయనగరం జిల్లా ద్వారపూడిలో ఆదివారం ఉదయం బయటకు ఆడుకోవడానికి వెళ్లిన నలుగురు చిన్నారులు ఇంటికి తిరిగి రాలేదు. బంధువులు వెతికినా వారి ఆచూకీ లేకపోవడంతో ఆందోళన చెందారు. అనంతరం గ్రామంలోని మహిళా మండలి కార్యాలయం సమీపంలో నిలిపి ఉంచిన ఓ కారులో నలుగురు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి.
ఇది కూడా చూడండి: Jyothi Malhotra: జ్యోతికి పాకిస్తాన్ ఆర్మీతో సంబంధాలు.. వెలుగులోకి సంచలన నిజాలు
ప్రాథమిక సమాచారం ప్రకారం.. వారు సరదాగా ఆ కారు లోపలికి వెళ్లి ఆడుకుంటుండగా, డోర్లు లాక్ కావడంతో ఊపిరాడక మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతులు చారుమతి (8), ఉదయ్ (8), మనస్వి, చరిష్మా (6)గా పోలీసులు గుర్తించారు. వీరిలో చారుమతి, చరిష్మా అక్కాచెల్లెళ్లు. ఈ రెండు ఘటనలు బాధిత కుటుంబాలతోపాటు రాష్ట్ర ప్రజలను తిరని శోకాన్ని మిగిల్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
accident | crime news | telangana | Andhra Pradesh