BREAKING: ఓరి నీచుడా.. స్నేహం పేరుతో దివ్యాంగురాలిపై అత్యాచారం.. భయంతో యువతి ఆత్మహత్య

హైదరాబాద్‌లో మీర్‌పేటలో దివ్యాంగురాలైన యువతిపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆ యువతి ఇంట్లో వాళ్లకి చెప్పలేక ఆత్మహత్య చేసుకుంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

New Update

హైదరాబాద్‌ మీర్‌పేట్‌ పీఎస్ పరిధి అల్మాస్‌గూడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దివ్యాంగురాలైన యువతిపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. వివరాల్లోకి వెళ్తే..  ప్రకాశం జిల్లాకు చెందిన ఏడు కొండలు కుటుంబం బతుకు తెరువు కోసం కొన్నేళ్ల కిందట హైదరాబాద్ వచ్చారు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలు కూడా దివ్యాంగులు.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో..

ఇంటికి ఎదురుగా ఉన్న శ్రీకాంత్‌తో పెద్ద కుమార్తెకు పరిచయం ఉంది. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ యువతిపై శ్రీకాంత్ అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆ యువతి తల్లిదండ్రులకు చెప్పలేక అవమానంతో యువతి బలవన్మరణం చేసుకుంది. బాధిత యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. 

ఇది కూడా చూడండి: రాజాసింగ్ సంచలన నిర్ణయం.. ‘ఉపఎన్నికల్లో పోటీ చేసి ఆ పార్టీని ఓడిస్తా’

ఇదిలా ఉండగా ఇటీవల ఏలూరు శివారులోని చోదిమెళ్లకి చెందిన 35 ఏళ్ల ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మందాడ దేవిక అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆమె భర్త సురేంద్ర కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడే. సురేంద్ర కాళ్లు, చేతులకు బ్లేడ్‌తో కోసిన గాయాలు, రక్తం కారుతుండటాన్ని స్థానికులు గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. దేవికకు, సురేంద్రకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

ఇది కూడా చూడండి:Producer AM Ratnam: ‘హరి హర వీరమల్లు’ నిర్మాతపై ఫిర్యాదు.. ఆందోళనలో ఫ్యాన్స్

దంపతులిద్దరూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. అయితే కుటుంబంలో ఏం జరిగిందో సరిగ్గా తెలియదు. కానీ దేవిక ఉరివేసుకుని అనుమానాస్పదంగా మరణించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. దేవిక మరణానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి:Alcohol: మద్యం మానేస్తే ఆరోగ్యంపై కలిగే ప్రయోజనాలు ఇవే.. 30 రోజులు ఇలా ట్రై చేయండి

Advertisment
Advertisment
తాజా కథనాలు