దొంగిలించిన డబ్బుతో లవర్లతో కలిసి మహాకుంభమేళాకు..చివరకు బిగ్ ట్విస్ట్!

ఇండోర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు దొంగతనం చేయగా వచ్చిన రూ.7 లక్షల డబ్బుతో తమ లవర్లతో కలిసి చేసిన పాపాలు కడిగేసుకుందామని  మహా కుంభమేళాకు  వెళ్లారు. అంత బాగానే జరిగింది కానీ ఇంటికి వచ్చిన తరువాత ఇద్దర్నీ అరెస్ట్ చేసి పోలీసులు ఊహించని షాకిచ్చారు.

New Update
lovers mahakumbh

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో 144 సంవత్సరాల తర్వాత జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తుతున్నారు. ఈ మహా కుంభమేళాలో స్నానం ఆచారిస్తే సకల పాపాలు పోతాయన్నది భక్తుల నమ్మకం. ఇప్పటికే కోట్లాదిమంది పవిత్రస్నానాలు ఆచరించారు. మరో నాలుగు రోజులలో మహాకుంభమేళా ముగియనుంది. అయితే ఈ సారి జరుగుతున్న కుంభమేలా 144 ఏళ్లకు వచ్చే ఆధ్యాత్మిక కార్యక్రమం కావడంతో ఇందులో పాల్గొనాలని, త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించాలని చాలా మంది భావిస్తున్నారు.

Also Read :  ఎంతకు తెగించార్రా.. ఒకడ్ని నమ్మి హోటల్ కు వెళ్తే.. నలుగురు కలిసి అత్యాచారం!

పాపాలు కడిగేసుకుందామని

అయితే ఇండోర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు దొంగతనం చేయగా వచ్చిన రూ.7 లక్షల డబ్బుతో తమ లవర్లతో కలిసి చేసిన పాపాలు కడిగేసుకుందామని  మహా కుంభమేళాకు  వెళ్లారు. అంతబాగానే జరిగింది. కానీ ఇంటికి వచ్చిన తరువాత ఇద్దర్నీ అరెస్ట్ చేసి పోలీసులు ఊహించని షాకిచ్చారు.  ఇద్దరు వ్యక్తులను అజయ్ శుక్లా, సంతోష్ కోరిగా గుర్తించారు, వీరిపై ఇప్పటికే ఇండోర్‌లో 15కి పైగా  దొంగతనం కేసులు నమోదయ్యాయి.

వేలిముద్రల ఆధారంగా

ఇండోర్‌లోని ద్వారకాపురిలో గత 15 రోజుల్లో దోపిడీ సంఘటనలు పెరుగుతున్నాయని పోలీసులకు సమాచారం అందింది. ఈ ప్రాంతంలోని నాలుగు ఇళ్లలో దొంగతనం జరిగిందని వచ్చిన ఫిర్యాదు ఆధారంగా, నిందితులను పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలంలో  లభించిన వేలిముద్రల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. వారి మొబైల్ ఫోన్‌లను ట్రాక్ చేయగా..  వారిద్దరూ తమ లవర్లతో కలిసిమహా కుంభమేళాకు వెళ్లినట్లుగా తేలింది. దీంతో వారు ఇండోర్‌కు తిరిగి వచ్చిన తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  దొంగిలించబడిన డబ్బులో ఎక్కువ భాగాన్ని మహా కుంభమేళాతో సహా వారి లవర్ల కోసం ఖర్చు చేశారని డీసీపీ రిషికేశ్ మీనా ఒక ప్రకటనలో తెలిపారు. వారి వద్ద నుంచి రూ.4 లక్షల విలువైన  వస్తువులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.    

Also read :  కుంభమేళాలో డిజిటల్ స్నానం...కేవలం 1100 లే..అదిరిపోయింది కదా ఐడియా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు