TG Crime: పండగ పూట పేకాట.. అడ్డంగా దొరికిన తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే!

పండగ పూట పేకాట ఆడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే. ఈ ఘటన వరంగల్‌ మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

New Update
tg ex mla

పండగ పూట పేకాట ఆడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే(congress-mla). ఈ ఘటన వరంగల్‌(warangal) మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి కొత్తవాడలోని మాజీ ఎమ్మెల్యే దోనెపూడి రమేశ్‌బాబు ఇంట్లో కొంతమంది పేకాడుతున్నట్లుగా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పక్కా ప్లాన్ తో  దాడి చేసి 13 మందిని అదుపులోకి తీసుకున్నారు.

Also Read :  57 సార్లు రాంగ్‌రూట్‌లో ప్రయాణం.. రూ.58వేలు ఫైన్

పోలీసులకు పట్టుబడిన వారిలో మాజీ ఎమ్మెల్యే దోనెపూడి రమేశ్‌బాబుతో పాటుగా  వరంగల్‌ స్టేషన్‌ రోడ్డు ప్రాంతానికి చెందిన గూడూరు హరిబాబు, కాజీపేట ప్రాంతానికి చెందిన వలుపదాసు సదానందం, పుట్ట మోహన్‌రెడ్డి, హంటర్‌రోడ్డు శాయంపేట ప్రాంతానికి చెందిన మాజీ కార్పొరేటర్‌ మాడిశెట్టి శివశంకర్‌, మామునూరు ప్రాంతానికి చెందిన నోముల తిరుపతిరెడ్డి, గిర్మాజీపేట ప్రాంతానికి చెందిన రావర్ల శ్రీనివాసరావు, సయ్యద్‌ జావీద్‌, కొత్తవాడకు చెందిన నీలం రాజ్‌కిశోర్‌ (తెలంగాణ ఉద్యమకారుడు) తదితరులు ఉన్నారు.

Also Read :  పీఏ గాళ్లు ఓట్లు వేస్తేనే గెలిచారా? పీఏలను బట్టలూడదీసి...ఎంపీ,ఎమ్మెల్యేలపై సామాన్యురాలి ఉగ్రరూపం

రూ.3,68,530 నగదు స్వాధీనం

వారి నుంచి రూ.3,68,530 నగదు, 15 సెల్‌ఫోన్లు, కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు పట్టుబడిన వారిలో చింతం సంతోష్‌పై గతంలో పేకాట శిబిరాలు నిర్వహించినట్లుగా, అధిక వడ్డీకి నగదు లావాదేవీలు కొనసాగించినట్లుగా ఆరోపణలున్నాయి.  

Advertisment
తాజా కథనాలు