/rtv/media/media_files/2025/05/25/OZDofkR8ADarRrhj0fuo.jpg)
OG Movie
OG సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. పవన్ ఫ్యాన్స్‌కు తాజాగా కిక్కిచ్చే అప్‌డేట్ వచ్చింది. ఓజీ సినిమా విడుదల తేదీని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తామని తెలిపారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ డేట్స్ ఇవ్వడంతో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
FIRING WORLDWIDE in cinemas on
— DVV Entertainment (@DVVMovies) May 25, 2025
25th September 2025… 💥💥💥💥
#OGonSept25#TheyCallHimOG #OG pic.twitter.com/DQAOFOrQxx
Also Read: డిప్యూటీ సీఎం పవన్ లేఖపై అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు
చాలాఏళ్ల తర్వాత పవన్ కల్యాణ్ గ్యాంగ్‌స్టర్ రోల్‌లో నటిస్తుండటంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ టీజర్ అందరిని ఆకట్టుకుంది. ఇందులో ప్రియాంక మోహన్ హిరోయిన్‌గా నటిస్తోంది. బాలివూడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ కీలక పాత్ర పోషిస్తున్నారు.
OG SAMBAVAM 💥
— SSC 🦅 (@_Shanmukh_33) May 25, 2025
From 25th September 2025… 💥💥💥💥
#OGonSept25 #TheyCallHimOG pic.twitter.com/FCEwxJlWr1
Also Read: బలగం నటుడు కన్నుమూత
డీవీవీ దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇదిలాఉండగా కొన్ని రోజుల క్రితం హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తయ్యింది. జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఇది థియేటర్లకి వచ్చిన మూడు నెలలకే ఓజీ వస్తుండటంతో పవన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక వచ్చే ఏడాది వేసవిలో హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
Area to Area (ATR) s pade roju🥶🥵🔥#TheyCallHimOG#OGonSept25 pic.twitter.com/YFLTdQoyaf
— Mahendra _Backup (@MahiRMS12) May 25, 2025
25th September 2025 💥💥💥💥
— PawanKalyan Addicts (@PK_Addicts) May 25, 2025
#OGonSept25#TheyCallHimOG #OG pic.twitter.com/of1L9zK8R4
Pawan Kalyan | telugu-news | rtv-news | og-movie | dvv-dhanayya