దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న విజయనగరం ISIS ఉగ్రమూలాల కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు సిరాజ్, సమీర్‌లను పోలీసులు 2 రోజులుగా విచారిస్తున్నారు. ఈ విచారణలో సిరాజ్‌ను ఓ గుర్తుతెలియని వ్యక్తి ప్రోత్సహిస్తున్నట్లు తేలింది. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియోపై సిరాజ్ చేసిన వ్యాఖ్యలకు ఆ వ్యక్తి స్పందించి, ప్రశంసించాడు. అతను రెవెన్యూ అధికారిగా గుర్తించారు పోలీసులు. దీంతో ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరని కూపీలాగుతున్నారు.
విజయనగరం పోలీసు ట్రెయినింగ్ అకాడమీలో శనివారం 7 గంటల పాటు విచారణ జరిగింది. టెర్రరిస్టులు సిరాజ్, సమీర్‌లు ఎమ్మెల్యే రాజాసింగ్ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసుల అనుమానిస్తారు. అందులో అధికారి పాత్రపై దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియాలో రాజాసింగ్‌పై పెట్టిన వీడియోతో ఆ రెవెన్యూ అధికారి సిరాజ్‌కు పరిచయం అయ్యాడు. సిరాజ్‌ను మెచ్చుకుంటూ అతడికి మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత వారి మధ్య చాటింగ్ మొదలైంది. కొంతకాలానికి ఆ వ్యక్తి తన వివరాలు సిరాజ్‌కు చెప్పాడు. తాను విశాఖకు చెందిన రెవెన్యూ అధికారి అని పరిచయం చేసుకున్నాడు. ఒక వర్గానికి వ్యతిరేకంగా సిరాజ్‌ను ప్రోత్సహించాడు.
mla-rajasingh | bjp-mla-rajasingh | conspiracy | isis-terror-conspiracy-case | isis-terror | vijayanagaram-news | latest-telugu-news